Like Numbers life

అంకెల లోకం… జీవితం అల్లకల్లోలం – గ్రేడుల గోలలో మరుగున పడుతున్న ప్రతిభ

సహనం వందే, హైదరాబాద్: మనం ఆడే ఆటలో స్కోరు పెరిగితే వచ్చే కిక్కే వేరు. ఆ అంకెలు మనల్ని ఉత్సాహపరుస్తాయి. కానీ అదే అంకెలు మన నిజ జీవితాన్ని శాసిస్తే? లైకులు రాలేదని బాధపడటం… మార్కులు తగ్గితే కుంగిపోవడం… ఇదంతా ఒక అదృశ్య జైలు. తత్వవేత్త సి థిన్గుయెన్ చెబుతున్న ఈ అంకెల మాయాజాలం గురించి చదివితే మీరు ఆశ్చర్యపోతారు. ఆటల్లో స్కోరు బోర్డు ఇస్తుంది గెలుపు కిక్కు…మీరు డన్జియన్స్ అండ్ డ్రాగన్స్ లాంటి ఆటలు ఆడుతున్నప్పుడు…..

Read More
Prof.Jayashankar Agri.University Exam Paper Leak Scam

అగ్రి లీకేజీ… భారీ ప్యాకేజీ – వ్యవసాయ వర్సిటీ పేపర్ల దందాలో పెద్దలు

సహనం వందే, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో అక్రమాల పుట్ట పగిలింది. అన్నదాతకు సాయం చేయాల్సిన ఏఈఓలే ఇప్పుడు కాపీ కొట్టి దొరికిపోయారు. తమ ప్రమోషన్ల కోసం ఏకంగా పేపర్లనే కొనుగోలు చేస్తూ అడ్డంగా బుక్కయ్యారు. ప్రభుత్వ సొమ్ముతో చదువుకుంటూ అక్కడే సిబ్బందికి ఆశ చూపి పేపర్లను బయటకు తెచ్చారు. గత ఎనిమిదేళ్లుగా సాగుతున్న ఈ దందా ఇప్పుడు బట్టబయలైంది. ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు వివరాలు చూస్తే సామాన్యుడు విస్తుపోవాల్సిందే. భ్రస్టు…

Read More
Demand for High Value Homes

సిటీ డ్రీమ్… రిచ్ గేమ్ – కోటి దాటిన ఇళ్లనే కొంటున్న ధనవంతులు

సహనం వందే, హైదరాబాద్: భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే తన ఆధిపత్యాన్ని చాటుకుంటోంది. ఇతర ప్రధాన నగరాల్లో అమ్మకాలు తగ్గుతున్నా… హైదరాబాద్ లో మాత్రం ఇళ్ల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. విలాసవంతమైన ఇళ్లకు గిరాకీ పెరగడంతో పాటు ధరలు కూడా సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరుతున్నాయి. నైట్ ఫ్రాంక్ ఇండియా తాజా నివేదిక ప్రకారం నగర రియల్ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇళ్ల విక్రయాల జోరు…హైదరాబాద్ నగరం 2025 సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని కనబరిచింది….

Read More
Navneet Kaur 's Comment Owaisi Counter

వై నాట్ 20… ఓవైసీ కౌంటర్ – బీజేపీ ఎంపీ నలుగురు సంతానంపై విమర్శ

సహనం వందే, మహారాష్ట్ర: దేశంలో హిందూ ముస్లిం రాజకీయం మరింత పెరుగుతుంది. ముస్లింలు ఎక్కువమంది కంటున్నారని… దీనివల్ల హిందుస్థాన్ పాకిస్తాన్ అయ్యే ప్రమాదం ఉందని బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ చేసిన కామెంట్లు రచ్చ అవుతున్నాయి. హిందువులు నలుగురు పిల్లలు కనాలంటూ ఆమె చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా ‘నాకు ఆరుగురు ఉన్నారంటూ, ఎంఐఎం అధినేత ఓవైసీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ కాక రేపుతున్నాయి. అభివృద్ధిని వదిలేసి పిల్లల సంఖ్య చర్చకు రావడం వింతగా మారింది. ఓవైసీ ఘాటు…

Read More
Surgeons met CM

సర్జన్ల భవనానికి సీఎం సహకారం – రేవంత్ రెడ్డిని కోరిన డాక్టర్ బొంగు రమేష్

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో వైద్య విద్యను మరింత ఉన్నత శిఖరాలకు చేర్చే దిశగా అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని సర్జన్ల నైపుణ్యాలను మెరుగుపరచడానికి, యువ వైద్యులకు ప్రపంచస్థాయి శిక్షణ అందించడానికి ఒక ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ మహత్తర ఆశయానికి ప్రభుత్వం నుంచి భూమి సహకారం కోరుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి విన్నవించింది. ముఖ్యమంత్రితో భేటీ…అసెంబ్లీ ప్రాంగణంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏఎస్ఐ…

Read More
#jobs by references

దోస్తులతోనే ఉద్యోగమస్తు – రిఫరల్ ఉంటే కొలువు 10 రెట్లు గ్యారెంటీ!

సహనం వందే, హైదరాబాద్: కొత్త ఏడాదిలో కొత్త ఉద్యోగంలో చేరాలని కలలు కంటున్నారా? అయితే మీరు కఠినమైన పోటీని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ప్రస్తుతం మార్కెట్లో వేలాది అప్లికేషన్లు వచ్చి పడుతున్నాయి. అర్హత ఉన్నా సరే సరైన వ్యూహం లేకపోతే వెనకబడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గాలంటే మీ దగ్గర ఒక పక్కా ప్లాన్ ఉండాలి. గురి చూసి కొట్టాలిఉద్యోగ వేటలో రెండు రకాల పద్ధతులు ఉంటాయి. ఒకటి వందల సంఖ్యలో అప్లికేషన్లు…

Read More
Sankrathi cinemas Box office

బాక్సాఫీస్ బీట్… పండుగ హీట్ – సంక్రాంతి హీరో… విజేత ఎవరో?

సహనం వందే, హైదరాబాద్: తెలుగు వారికి సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అరవై ఏళ్ల వృద్ధుడి నుంచి ఆరేళ్ల పిల్లాడి వరకు ప్రతి ఒక్కరూ థియేటర్ల వైపు చూసే సమయం ఇది. ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద యుద్ధం మామూలుగా ఉండేలా లేదు. అగ్ర కథానాయకులు తమ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. పండుగ హడావుడి ఇప్పుడే మొదలైంది. ప్రభాస్ వింటేజ్ మేజిక్…రెబల్ స్టార్ ప్రభాస్ ఈసారి తన పంథా మార్చారు. భారీ యాక్షన్ చిత్రాల తర్వాత ‘ది రాజా…

Read More
Doctors met CM

ముఖ్యమంత్రికి డాక్టర్ల మొర – వైద్యుల సమస్యలు పరిష్కరించాలని విన్నపం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్యం సంక్షోభంలో పడే ప్రమాదం కనిపిస్తోంది. రోగుల ప్రాణాలు కాపాడే డాక్టర్లే ఇప్పుడు తమ ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలు వైద్యుల్లో తీవ్ర అసంతృప్తిని నింపుతోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం పొంచి ఉందని వైద్య సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రికి మొరప్రభుత్వ వైద్యుల సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అప్రమత్తమైంది….

Read More
Venezuela President Madura

ట్రంప్ హంటింగ్… గ్లోబల్ షాకింగ్ – అధునాతన టెక్నాలజీతో అధ్యక్షుడి అంతం

సహనం వందే, హైదరాబాద్: ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం అంటే అది కేవలం సినిమాల్లోనే సాధ్యం అనుకున్నారంతా. కానీ జనవరి 3వ తేదీ అర్ధరాత్రి వెనిజులా రాజధాని కరాకాస్‌లో జరిగిన ఘటన హాలీవుడ్ యాక్షన్ సినిమాను మించిపోయింది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అధ్యక్ష భవనంలోకి అమెరికా బలగాలు ఎలా జొరబడ్డాయి? వేల సంఖ్యలో ఉన్న వెనిజులా సైన్యం ఏమైంది? మదురో ఎందుకు అడ్డుకోలేకపోయారు? ఈ ఆపరేషన్ వెనుక ఉన్న అసలు రహస్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అత్యంత…

Read More
Revanth serious action on Oilpalm company Lohiya

రేవంత్ మార్క్… అదిరిపోయే స్ట్రోక్ – ఆయిల్ పామ్ కంపెనీలపై ప్రభుత్వం కొరడా

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావిస్తుంటే కొన్ని కంపెనీలు మాత్రం మొద్దునిద్ర పోతున్నాయి. క్షేత్రస్థాయిలో సాగు పెంచకుండా కాలయాపన చేస్తూ రైతుల పొట్ట కొడుతున్నాయి. ఇలాంటి సంస్థల పట్ల ఉదాసీనత పనికిరాదని భావించిన సర్కారు తాజాగా కఠిన నిర్ణయం తీసుకుంది. సాగులో పురోగతి చూపని కంపెనీల జోన్లను రద్దు చేస్తూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు…

Read More