సివిల్స్ ఎంపికల్లో మారిన లెక్కలు – నాన్ క్రీమీలేయర్ పరిమితిపై సుప్రీం సంచలన తీర్పు
సహనం వందే,న్యూఢిల్లీ: దేశంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ ఉద్యోగాల కోసం కష్టపడే వేలాది మంది ఓబీసీ అభ్యర్థులకు సంబంధించి సుప్రీంకోర్టు అత్యంత కీలక ప్రకటన చేసింది. నాన్ క్రీమీలేయర్ పరిమితిపై కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పునఃపరిశీలన పిటిషన్పై ఈ నెల 6వ తేదీన సుదీర్ఘ విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, తన మార్చి 11 నాటి తీర్పును మరోసారి పునరుద్ఘాటించింది. ఈ నిర్ణయంతో సివిల్స్ ఉద్యోగాల కేటాయింపులు, రిజర్వేషన్ల అర్హతలపై నెలకొన్న ఉత్కంఠకు స్పష్టత వచ్చింది….