Three Years Practice Necessary for Judge Exam

జడ్జి పరీక్షలకు ‘ప్రాక్టీస్’ ఊరట – మూడేళ్ల ప్రాక్టీస్ నిబంధన రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: న్యాయమూర్తి కావాలని కలలు కనే యువ లా గ్రాడ్యుయేట్లకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. గతంలో ఉన్న మూడేళ్ల లీగల్ ప్రాక్టీస్ నిబంధనను ఒక సంవత్సరానికి తగ్గిస్తూ శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఈ నిర్ణయంతో న్యాయ విద్య పూర్తి చేసిన వెంటనే సివిల్ జడ్జి పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు పెద్ద ఉపశమనం లభించింది. 2025 నాటి తీర్పుకు సవరణ…సుప్రీంకోర్టు ప్రధాన జ్యుడీషియరీ పరీక్షల అర్హతకు సంబంధించి గతంలో ఇచ్చిన మే 2025 నాటి తీర్పును…

Read More
Coaching Centres

కోచింగ్ సెంటర్లపై ‘సుప్రీం’ చెంపచెళ్లు – కోచింగ్ సెంటర్ల దోపిడీ… డమ్మీ స్కూళ్ల రాజ్యం

సహనం వందే, న్యూఢిల్లీ: దేశంలో విద్యా వ్యవస్థను మలుపు తిప్పే కీలక పరిణామం చోటుచేసుకుంది. విద్యార్థుల మానసిక ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్న కోచింగ్ రాజ్ వ్యవస్థపై సుప్రీంకోర్టు దృష్టి సారించింది. అడ్డగోలుగా సాగుతున్న డమ్మీ స్కూళ్ల సంస్కృతికి స్వస్తి పలికేలా జాతీయ స్థాయి ఫ్రేమ్‌వర్క్ రూపొందించాలనే డిమాండ్‌తో దాఖలైన పిటిషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అంతం లేని పోటీపాఠశాల విద్య అంటే తరగతి గదిలో నేర్చుకునేది. కానీ నేడు కోచింగ్ సెంటర్లు పాఠశాలలను మింగేస్తున్నాయి. డమ్మీ స్కూళ్లు పుట్టుకొచ్చాయి….

Read More
Justice Surya Kanth comments on SocialMedia

జడ్జీలపై సోషల్ మీడియా దాడి – సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం

సహనం వందే, న్యూఢిల్లీ: భారత అత్యున్నత న్యాయస్థానం వేదికగా ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీసేలా జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ఆధునిక మాధ్యమాల ద్వారా న్యాయమూర్తులను లక్ష్యంగా చేసుకోవడం ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదమని ఈ కథనం వివరిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం…సుప్రీంకోర్టులో శుక్రవారం నాడు ఒక ఆసక్తికరమైన విచారణ జరిగింది. ఒక న్యాయవాది తనను సీనియర్ అడ్వొకేట్‌గా గుర్తించాలని కోరుతూ దాఖలు…

Read More
Supreme Court Judgement on OBC Quota

రిజర్వేషన్ల కోతపై కోర్టు కొరడా – ఓబీసీ క్రిమీలేయర్ గుర్తింపుపై కీలక తీర్పు

సహనం వందే, న్యూఢిల్లీ: ఓబీసీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ గుర్తింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సామాజిక న్యాయంలో కొత్త చర్చకు దారితీసింది. కేవలం తల్లిదండ్రుల ఆదాయం ఆధారంగానే రిజర్వేషన్ ఫలాలను ఆపడం అన్యాయమని కోర్టు తేల్చి చెప్పింది. అసలు సామాజిక హోదా అంటే ఏమిటి? ఎందుకు ఆదాయం మాత్రమే ప్రామాణికం కాకూడదు? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. సామాజిక హోదా అంటే ఏమిటి?ఓబీసీలలో సామాజికంగా వెనుకబడిన వారిని గుర్తించేందుకు 1993లో ప్రభుత్వం ఒక పద్ధతిని తెచ్చింది. దీని ప్రకారం…

Read More

బీసీ కోటా… కోర్టుల్లో రగడ – 42 శాతం రిజర్వేషన్లపై సుప్రీంలో సవాల్

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఈ న్యాయపరమైన జోక్యం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించింది. వంగ గోపాల్ రెడ్డి అనే వ్యక్తి గత నెల 29న ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టులో వేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విక్రమ్…

Read More

పరువునష్టం నీడలో పగ – డిఫమేషన్ చట్టంతో స్వేచ్ఛకు సంకెళ్లు

సహనం వందే, న్యూఢిల్లీ:పరువు నష్టం చట్టం (డిఫమేషన్ లా) ఒక వ్యక్తి గౌరవాన్ని కాపాడటానికి బదులుగా రాజకీయ ప్రత్యర్థులను వేధించడానికి, జనం గొంతు నొక్కడానికి ఒక ఆయుధంగా మారిందని సుప్రీం కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర కుమార్ గోపు తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఈ చట్టం దుర్వినియోగం అవుతున్న తీరును ఆయన కామెంట్స్ స్పష్టం చేశాయి. ఆయన ఈ చట్టాన్ని పూర్తిగా…

Read More

అటు ట్రంప్… ఇటు సుప్రీం – బ్యాలెట్ ఎన్నికలకు బలం ఇచ్చిన ఘటనలు

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్నికలు ప్రజాస్వామ్యానికి ప్రాణం. ప్రజల ఓటుతో ప్రభుత్వాలు ఏర్పడతాయి. కానీ ఆ ఓటును నమోదు చేసే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై (ఈవీఎంలు) ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాస్వామ్యానికి ఈ యంత్రాలు గొడ్డలిపెట్టుగా మారాయనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈవీఎంలకు బదులు కాగితపు బ్యాలెట్ కు మారుతామని ప్రకటించడం, భారత్‌లో సుప్రీంకోర్టు ఈవీఎంలలోని లోపాలను బయటపెట్టడం ఈ చర్చకు మరింత బలం చేకూర్చింది. అమెరికాలో ఈవీఎంల మీద అనుమానాలు…అమెరికా దేశీయ నిఘా…

Read More

పార్లమెంట్ భవనాన్ని మూసేయాలా?

సహనం వందే, ఢిల్లీ: సుప్రీంకోర్టుపైన, ప్రధాన న్యాయమూర్తి పైన బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే, ఇక పార్లమెంటు ఎందుకని ఆయన మండిపడ్డారు‌. భారతదేశంలో జరుగుతున్న అంతర్యుద్ధాలకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సంజీవ్ ఖన్నా బాధ్యత వహించాలని దుబే సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టు తన పరిధిని దాటి మతపరమైన యుద్ధాలను రెచ్చగొడుతోందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలు దేశ రాజకీయ, న్యాయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి….

Read More

స్మిత వర్సెస్ సీఎం

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వానికి, సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మిత సబర్వాల్ కు మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. ఒకరకంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే ఢీకొంటున్నారు. కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఏఐ ఫోటో రీట్వీట్ చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు పోలీసులు జారీ చేసిన నోటీసులకు ఆమె ఏమాత్రం వెరవడంలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ట్వీట్లను వరుసగా రీట్వీట్ చేస్తూ సంచలనం సృష్టిస్తున్నారు. తన ట్వీట్లను తొలగించకపోగా, ప్రభుత్వాన్ని ప్రశ్నించేలా రీట్వీట్లు…

Read More

బిడ్డ మాయమైతే ఆసుపత్రి లైసెన్స్ రద్దు

సహనం వందే, న్యూఢిల్లీ: ఇకపై ఏ ఆసుపత్రిలో పసిపాప కనిపించకుండా పోయినా, వారి లైసెన్స్ రద్దు చేయడం ఖాయం! పిల్లల అక్రమ రవాణాదారుల పట్ల తల్లిదండ్రులు ఎంత అప్రమత్తంగా ఉండాలో, ఆసుపత్రులు కూడా అంతే బాధ్యతగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు మంగళవారం తన తీర్పులో స్పష్టం చేసింది. ముఠాల నుంచి చిన్నారులను కాపాడటంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని అత్యున్నత న్యాయస్థానం పిలుపునిచ్చింది. కంటికి రెప్పలా కాపాడాలి… ప్రతి ఆసుపత్రిలో ప్రసవించిన శిశువు సంపూర్ణ బాధ్యత ఆసుపత్రి సిబ్బందిదేనని జస్టిస్…

Read More