Raka Allu Arjun Movie

‘రాకా’ కేక – అల్లు అర్జున్ అదుర్స్… అట్లీ మాస్ మ్యాజిక్

సహనం వందే, హైదరాబాద్: గ్లోబల్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వేళ చిత్ర పరిశ్రమలో భారీ ప్రకంపనలు మొదలయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక మాస్ యాక్షన్ డ్రామా కోసం దక్షిణ భారతం నుంచి బాలీవుడ్ వరకు అంచనాలు నెలకొన్నాయి. కేవలం ఒక టైటిల్ పోస్టర్‌తోనే సినిమా ప్రపంచాన్ని అట్లీ తన వైపు తిప్పుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గ్లోబల్ బాక్సాఫీస్ లెక్కలను పూర్తిగా మార్చేలా కనిపిస్తోంది. బన్నీ బర్త్ డే గిఫ్ట్ఏప్రిల్ 8న ఐకాన్…

Read More
Queer Parliamenterian

‘క్వీర్’ క్వీన్ పార్లమెంటేరియన్ – తొలి లెస్బియన్ ఎంపీగా మేనక చరిత్ర

సహనం వందే, న్యూఢిల్లీ: ప్రేమకు భాష లేదు… కానీ ఆ ప్రేమను గుర్తించని చట్టాలకు మాత్రం కఠినమైన భాష ఉంటుంది. ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఇష్టపడటం ఈ సమాజంలో ఎంతటి నేరమో, ఆ చీకటి గదుల్లో దాచుకున్న కన్నీళ్లకు ఎంతటి భారమో మేనక గురుస్వామికి, అరుంధతి కాట్జూకు బాగా తెలుసు. అందుకే వారు కేవలం ఒక జంటగా కాకుండా ఒక సైన్యంగా మారి సుప్రీంకోర్టు గడప తొక్కారు. తమలాంటి లక్షలాది మంది లెస్బియన్లు, గేల జీవితాల్లో వెలుగు…

Read More
MNJ Awards

ఉత్తమ డాక్టర్ మాటూరి రమేష్ – వైద్య ఆరోగ్య మంత్రి చేతుల మీదుగా అవార్డు

సహనం వందే, హైదరాబాద్: క్యాన్సర్ చికిత్సలో ఎంఎన్జే ఆసుపత్రి అరుదైన రికార్డు సృష్టించింది. మహిళల ప్రాణాలను కాపాడటంతోపాటు వారి ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టే సరికొత్త ఆంకోప్లాస్టిక్ సర్జరీలతో వైద్య రంగంలో సంచలనం రేపుతోంది. గతంలో రొమ్ము క్యాన్సర్ అంటే అవయవాన్ని తొలగించడమే ఏకైక మార్గంగా ఉండేది. కానీ ఇప్పుడు ఎంఎన్జేలో ఆధునిక సాంకేతికతతో రొమ్మును తొలగించకుండానే గడ్డలను తొలగించి తిరిగి పునర్నిర్మిస్తున్నారు. మెడికల్ అవార్డ్…మెడికల్ అవార్డుల విభాగంలో ఎంఎన్జే ఆసుపత్రి ఇప్పుడు దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో…

Read More
Amaravathi kalisetti

అమరావతికి కలిశెట్టి మొక్కులు – రైతులకు ఎంపీ అప్పలనాయుడు అండదండ

సహనం వందే, అమరావతి: అమరావతి రాజధాని కోసం రైతులు చేసిన సుదీర్ఘ పోరాటం నేడు చారిత్రక ఘట్టానికి చేరింది. వైసీపీ ప్రభుత్వ అరాచకాలను ఎదురించి ప్రాణాలను పణంగా పెట్టిన రైతుల కృషి ఫలించింది. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ విజయోత్సవంలో రైతులతో కలిసి పంచుకున్న భావోద్వేగ క్షణాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. అరసవిల్లి మొక్కు తీరింది…రాజధాని చట్టబద్ధత కోసం నాడు రైతులు అమరావతి నుండి అరసవిల్లి వరకు పాదయాత్ర చేశారు. ఆ…

Read More
Tamilnadu Judgement

దద్దరిల్లిన తమిళనాడు కోర్టు జడ్జిమెంట్ – ఏకంగా 9 మంది పోలీసులకు ఉరిశిక్ష

సహనం వందే, తమిళనాడు: జీవితం అనేది ఒక నిరంతర ప్రయాణం. కానీ కొందరి ప్రయాణాన్ని అధికార గర్వం అర్ధాంతరంగా ముగించేస్తుంది. రక్షించాల్సిన చేతులే రాక్షసంగా మారినప్పుడు చట్టం తన విశ్వరూపం చూపిస్తుంది. లాఠీకి రక్తం అంటుకున్నప్పుడు న్యాయం నిశ్శబ్దంగా ఉండదు. సాతంకుళం వీధుల్లో ఆ రాత్రి మరణం అధికార అహంకారం రూపంలో వచ్చింది. న్యాయం ఆలస్యమైనా అది విధించిన శిక్ష ఇప్పుడు చరిత్రలో ఒక హెచ్చరికగా నిలిచిపోతుంది. ప్రాణం తీసిన శాడిజంతమిళనాడులోని తూత్తుకుడి జిల్లా సాతంకుళం పోలీస్…

Read More
Communism and AI

కమ్యూనిజం కొత్త వేషం – కంప్యూటర్ కోడింగ్‌ రూపంలో వర్గ పోరాటం

సహనం వందే, హైదరాబాద్: మనం పుట్టినప్పుడు మన చేతులకు ఉన్న రేఖలు మన భవిష్యత్తును చెప్తాయని అమ్మమ్మలు అనేవారు. కానీ ఇప్పుడు ఆ రేఖల స్థానంలో సిలికాన్ చిప్‌లు, మెటల్ తీగలు వచ్చి చేరాయి. శ్రమను నమ్ముకున్న మధ్యతరగతి మనిషి ఇప్పుడు ఒక అపరిచిత యుద్ధంలో నిలబడ్డాడు. తనకి తెలియని శత్రువుతో, తాను చూడని రోబోలతో అతను పోరాడుతున్నాడు. ఇది కేవలం రాజకీయాల గురించి కాదు, ఇది మనిషి ఉనికి గురించి. గొంతు చించుకుని చేసే నినాదాలు…

Read More
War photos

యుద్ధం తెచ్చిన అదృష్టం – ఇండియన్ స్టార్టప్‌ కంపెనీల అంతరిక్ష వేట

సహనం వందే, హైదరాబాద్: అమెరికా-ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు భారతీయ అంతరిక్ష స్టార్టప్‌ లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. యుద్ధ క్షేత్రంలో శత్రువుల కదలికలను కనిపెట్టే ‘స్పేస్ బేస్డ్ సర్వైలెన్స్’ డేటా కోసం ప్రపంచం ఇప్పుడు భారత్ వైపు చూస్తోంది. గగనతలంలో నిశ్శబ్దంగా తిరుగుతున్న మన దేశీ ఉపగ్రహాలు ఇచ్చే సమాచారం అంతర్జాతీయ రక్షణ సంస్థలకు, బీమా కంపెనీలకు దిక్సూచిగా మారింది. ఒకప్పుడు కేవలం ప్రయోగాలకే పరిమితమైన మన యువ కంపెనీలు ఇప్పుడు గ్లోబల్ వార్…

Read More
Stalin

హిందీపై ఎదురు తిరిగిన ద్రవిడ గడ్డ – మూడు భాషలపై స్టాలిన్ నిప్పులు

సహనం వందే, తమిళనాడు: దక్షిణాది గడ్డపై మళ్ళీ భాషా యుద్ధం మొదలైంది. కేంద్రం తెచ్చిన విద్యా విధానంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిప్పులు చెరిగారు. హిందీని రుద్దే ప్రయత్నం చేస్తే బీజేపీకి పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. నిధుల ఆంక్షలతో రాష్ట్రాన్ని లొంగదీసుకోవాలని చూడటం అప్రజాస్వామికమని ఆయన మండిపడ్డారు. ఈ గొడవ ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ సెగలు పుట్టిస్తోంది. తమిళనాడుకు నిధుల వేటుతమిళనాడుకు రావాల్సిన విద్యా నిధులను కేంద్రం కావాలనే తొక్కి పెడుతోంది. మూడు భాషల విధానాన్ని అమలు…

Read More
Gleeden App

రాత్రి వేళల్లో రహస్య ముచ్చట్లు – విచ్చలవిడితనానికి వేదిక ‘గ్లీడెన్’ యాప్

సహనం వందే, హైదరాబాద్: జీవితం ఒక రహస్యాల నిలయం. పవిత్రమైన బంధంలో ఉన్నామని లోకానికి చెప్పుకుంటూనే మరో తోడు కోసం ఆరాటపడే మనస్తత్వం నేడు పెరిగిపోతోంది. గ్లీడెన్ అనే యాప్ ఇప్పుడు భారతీయుల ఫోన్లలో నిశ్శబ్దంగా తిష్టవేసింది. పెళ్లయిన వారు మరో వ్యక్తితో రహస్యంగా బంధం పెట్టుకోవడానికి ఇది ఒక వంతెనలా పనిచేస్తోంది. అంకెలు చూస్తుంటే మన నైతిక విలువల గోడలు నెమ్మదిగా బీటలు వారుతున్నాయి. వ్యభిచారానికి డిజిటల్ వేదికగ్లీడెన్ అనేది సాధారణ డేటింగ్ యాప్ కాదు….

Read More
Parakala comments on Andhra Elections

ఏపీలో అర్థరాత్రి ఓట్ల కుట్ర – 2024 ఎన్నికల్లో ‘ఆరు సెకన్ల’ మాయాజాలం

సహనం వందే, న్యూఢిల్లీ: భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణ తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో వెలుగుచూసిన కొన్ని గణాంకాలు అంతర్జాతీయ స్థాయిలో విస్తుపోయేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఓటింగ్ ముగిసిన తర్వాత అర్థరాత్రి వేళ నమోదైన ఓట్లు, వాటి వేగం చూస్తుంటే వ్యవస్థలో ఏదో లోపం జరిగిందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఢిల్లీ వేదికగా మేధావుల గళంఢిల్లీలో…

Read More