జేఎన్టీయూ రీసెర్చ్ స్కామ్? – సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో షాకింగ్ నిజాలు
సహనం వందే, హైదరాబాద్: పరిశోధనలకు ప్రోత్సాహం ఇవ్వాలంటే విశ్వవిద్యాలయాలకు నిధులు అవసరం. కొత్త పరికరాలు కొనాలి. ప్రయోగాలు నిర్వహించాలి. విద్యార్థులు, అధ్యాపకులు కొత్త ఆవిష్కరణల దిశగా అడుగులు వేయాలి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలు కోట్లాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నాయి. అయితే ఆ నిధుల ఖర్చుకు సంబంధించిన లెక్కలు మాత్రం పక్కాగా ఉండాలి. ప్రతి కొనుగోలుకు ఆధారాలు ఉండాలి. కానీ జేఎన్టీయూలో పరిశోధన నిధుల వినియోగంపై రాష్ట్ర ఆడిట్ శాఖ లేవనెత్తిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…