సీట్ల నై’వైద్యం’… ‘నాడి’ ప్రశ్నార్థకం – కొత్తగా 5000 పీజీ… 5023 ఎంబీబీఎస్ సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో వైద్య విద్యను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో 5,000 పీజీ, 5,023 ఎంబీబీఎస్ సీట్లను పెంచేందుకు ఆమోదం లభించింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య నిపుణుల కొరతను ఈ సీట్ల పెంపు తీరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే వైద్య విద్యలో నాణ్యతపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్న తరుణంలో కేంద్రం…

Read More

విస్కీ పీక పిస్కీ – సిగరెట్లు, మద్యం, పాన్లపై 40 శాతం పన్ను

సహనం వందే, న్యూఢిల్లీ:పన్నుల విషయంలో జీఎస్టీ కౌన్సిల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈనెల 22 నుంచి జీఎస్టీలో ప్రధానంగా రెండు స్లాబ్‌లు (5 శాతం, 18 శాతం) ఉండబోతున్నాయి. కానీ సామాజిక శ్రేయస్సుకు హాని కలిగించే వస్తువులు (సిన్ గూడ్స్), అలాగే లగ్జరీ ఉత్పత్తులపై ఏకంగా 40 శాతం పన్ను విధించాలని నిర్ణయించింది. ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక సమతుల్యతను కాపాడే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ అనూహ్య నిర్ణయం దేశవ్యాప్తంగా…

Read More

పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More

వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

18 వేల ఎంబీబీఎస్ సీట్ల కుంభకోణం – ఈడీ దర్యాప్తులో వెలుగులోకి అక్రమాలు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా వైద్య విద్యలో జరిగిన భారీ కుంభకోణం ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా పేరుతో నకిలీ పత్రాలతో వేలాది మంది విద్యార్థులు ఎంబీబీఎస్ సీట్లను దక్కించుకున్నట్లు తాజా దర్యాప్తులో బయటపడింది. ఈ కుంభకోణంలో దాదాపు 18 వేల మంది విద్యార్థులు ఫోర్జరీ సర్టిఫికెట్లతో వైద్య కళాశాలల్లో చేరినట్లు తేలింది. ఈ దారుణంపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు చేపట్టి ఈ మోసాన్ని బట్టబయలు చేసింది. నకిలీ పత్రాలతో దందా…వైద్య కళాశాలల్లో…

Read More

ఓట్ల కుంభకోణం… లోక్‌సభ రద్దు – మళ్లీ దేశవ్యాప్తంగా ఎన్నికలకు డిమాండ్

సహనం వందే, హైదరాబాద్:తమిళనాడు విజయ్ నటించిన సర్కార్ సినిమా చూసే ఉంటారు. అందులో తన ఓటును మరొకరు వేయడంపై పెద్ద పోరాటమే చేస్తారు. తన ఓటు తనకు కల్పించాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తారు. ఆ పోరాటం కాస్త అన్ని నియోజకవర్గాలకి పాకి చివరకు లక్షలాదిమంది తమ ఓటు ఎవరో వేశారని ఫిర్యాదులు చేస్తారు. దీంతో ప్రమాణ స్వీకారం చేయాల్సిన కొత్త ప్రభుత్వం కోర్టు తీర్పు కారణంగా నిలిచిపోతుంది. తిరిగి ఎన్నికలు నిర్వహిస్తారు. ఒకరకంగా అటువంటి పరిస్థితి ఇప్పుడు…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

సూటు బూటు… దొంగ ఓటు – ఎన్నికల కమిషన్ అధికారుల లీలలు

సహనం వందే, న్యూఢిల్లీ:కేంద్ర ఎన్నికల కమిషన్ లో వాళ్లంతా సీనియర్ ఐఏఎస్ అధికారులు. సూటు బూటు వేసుకొని టై కట్టుకుని గొప్ప ఇంగ్లీషులో మాట్లాడతారు. గొప్ప చదువులు చదివారు కాబట్టి గొప్ప సూక్తులు కూడా చెప్తారు. దేశానికి తామే నిజమైన సేవకులు అన్నట్లు ఫోజులు కొడతారు. కానీ తెర వెనక మాత్రం చీకటి వ్యవహారాలు నడుపుతారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి డబ్బుకు అమ్ముడుపోతారు. స్వయం ప్రతిపత్తితో నడవాల్సిన ఎన్నికల కమిషన్ ను కొందరు రాజకీయ నేతల వద్ద…

Read More

పార్టీగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు – రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

సహనం వందే, న్యూఢిల్లీ:వెనుకబడిన తరగతులకు (బీసీలకు) 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తమ చిత్తశుద్ధిని తెలంగాణ ప్రభుత్వం మరోసారి చాటుకుంది. బీసీల ఆకాంక్షలను నెరవేర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం అలుపెరగని పోరాటం చేస్తోంది. విద్య, ఉద్యోగావకాశాల్లోనూ, అలాగే స్థానిక సంస్థల్లోనూ 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించిన రెండు కీలక బిల్లులు ఇప్పుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బిల్లులను తక్షణమే…

Read More

కోట్ల ఓట్లకు గండి – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు

సహనం వందే, న్యూఢిల్లీ:కాంగ్రెస్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితా లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, ఇందులో ఎన్నికల సంఘం కూడా భాగమైందని ఆయన ఆరోపించారు. ఈ సంచలన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. ఓటర్ల జాబితాలో కోట్లాది మంది అదృశ్యంరాహుల్ గాంధీ మాట్లాడుతూ… గత లోక్‌సభ ఎన్నికల తర్వాత ఓటర్ల జాబితాలో అనేక మార్పులు జరిగాయని తెలిపారు….

Read More