మక్కల వేలంలో చిక్కుముడులు – బేస్ ప్రైస్ లేకుండా మార్క్ ఫెడ్ వేలం
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో మక్కల విక్రయం ఇప్పుడు పెద్ద చిక్కుముడిలా మారింది. ప్రభుత్వం ఏకంగా 14.70 లక్షల మెట్రిక్ టన్నుల స్టాక్‌ను బేస్ ప్రైస్ లేకుండానే ఈ-వేలం వేయడానికి సిద్ధమైంది. వానాకాలం అమ్మకాల్లో అదనపు ఆదాయం వచ్చినట్లు చెప్పుకున్నా అసలు లెక్కలు మాత్రం వందల కోట్ల నష్టాన్ని చూపిస్తున్నాయి. మార్క్ ఫెడ్ తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధానం మారిందిమార్క్‌ఫెడ్ యాసంగి మక్కల విక్రయానికి కొత్త బాట పట్టింది. ఇప్పటివరకు ఉన్న పద్ధతులకు స్వస్తి…