బ్యాలెట్ బాక్స్ బద్దలు – నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం
సహనం వందే, న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త చర్చకు తెరలేచింది. ఈవీఎంల పనితీరును తరచూ ప్రశ్నించే ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి తాజాగా ఊహించని షాక్ తగిలింది. నాలుగు రాష్ట్రాల పరిధిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక చతికిలపడింది. పోటీ చేసిన చోట్ల అసలు ఖాతా కూడా తెరవలేకపోవడం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఫలితాలు కేవలం సాధారణ ఓటమి కాదని, క్షేత్రస్థాయిలో పార్టీ సంస్థాగత బలహీనతలకు అద్దం…