హైదరాబాద్ ఫార్మాపై అమెరికా మెరుపు దాడి – డాక్టర్ రెడ్డీస్‌కు అగ్రరాజ్య ఎఫ్‌డీఏ నోటీసులు
సహనం వందే, హైదరాబాద్: హైదరాబాద్ శివారులోని బాచుపల్లిలో ఉన్న డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ బయోలాజికల్ తయారీ కేంద్రంలో అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థకు చెందిన నిపుణుల బృందం ఈనెల 16 నుండి 25వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది. ఈ ప్రక్రియలో తయారీ విధానాలు, పరిశుభ్రత, రికార్డుల నిర్వహణపై వారు సునిశితంగా పరిశీలన చేశారు. తనిఖీ ముగిసిన వెంటనే అమెరికా అధికారులు ఏడు కీలకమైన అభ్యంతరాలను లేవనెత్తుతూ సంస్థకు నోటీసులు జారీ చేశారు. ఆ…