కసితో రగిలిపోతున్న ప్రేమజంటలు – దేశాన్ని వణికిస్తున్న బిహార్ లవ్ మర్డర్స్
సహనం వందే, న్యూఢిల్లీ: ప్రేమలో పడితే ప్రపంచమే అందంగా కనిపిస్తుందని అంటారు. ఇద్దరి మధ్య అనుబంధం పెరిగితే జీవితానికి కొత్త అర్థం వస్తుంది. కానీ అదే సంబంధంలో అనుమానాలు, గొడవలు, కోపం పెరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు ప్రేమ కోసం ఎదురుచూసిన వ్యక్తులే.. చివరకు ప్రాణాలు తీసే స్థాయికి వెళ్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాలు, అక్రమ సంబంధాలకు సంబంధించిన వివాదాల కారణంగా 2024లో బిహార్‌లో ఏకంగా 317 హత్యలు జరిగినట్లు వెల్లడైంది. ఇందులో…