Students Protest at Bihar

బీహారులో భగ్గుమన్న విద్యార్థి లోకం – జైళ్లలోని విద్యార్థుల విడుదలకు డిమాండ్

సహనం వందే, పాట్నా: నీట్ పేపర్ లీక్ కుంభకోణానికి వ్యతిరేకంగా గతంలో అరెస్టయిన విద్యార్థుల విడుదల కోసం పాట్నా వీధుల్లో వందలాది మంది మరోసారి రోడ్డెక్కడంతో బీహార్ రాజకీయం వేడెక్కింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడుతూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించిన నిరసనకారులపై పోలీసులు నీటి ఫిరంగులను ప్రయోగించి అణచివేసే ప్రయత్నం చేశారు. సీఎం నివాసం వద్ద ఉద్రిక్తతనేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా, ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్…

Read More
Prashanth Kishore - Bihar Elections

జెన్ జెడ్… బీహార్ దడ దడ – బాంకీపుర్‌లో ప్రశాంత్ కిషోర్ ఘనవిజయం

సహనం వందే, బీహార్: బీహార్ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపేసిన బాంకీపూర్ ఉప ఎన్నిక ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సాధించిన అనూహ్య విజయం రాష్ట్రంలో దశాబ్దాలుగా వేళ్లూనుకుపోయిన రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. అధికార బీజేపీతో పాటు విపక్ష ఆర్జేడీని నివ్వెరపరుస్తూ యువత ఎంచుకున్న ఈ కొత్త దారి బీహార్ భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. బాంకీపూర్‌లో భారీ విజయంబీహార్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బాంకీపూర్ ఉప…

Read More
Pappu Yadav Comments on Politicians

నేతల ఫోన్లలో బూతు బొమ్మలు – పోర్న్ లీలలపై ఎంపీ పప్పు యాదవ్ విసుర్లు

సహనం వందే, బీహార్: భారత రాజకీయ యవనికపై నైతిక విలువలు పాతాళానికి పడిపోయాయని పప్పు యాదవ్ వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. ప్రజాప్రతినిధుల వ్యక్తిగత ప్రవర్తనపై ఆయన చేసిన బాంబు లాంటి ప్రకటనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. రాజకీయాల్లోకి వచ్చే మహిళల పట్ల ఉన్న వివక్షను, నేతల తీరును ఆయన ఎండగట్టడం చర్చనీయాంశంగా మారింది. పప్పు యాదవ్ సంచలనంపూర్ణియా స్వతంత్ర ఎంపీ పప్పు యాదవ్ మరోసారి వార్తల్లో నిలిచారు. రాజకీయ నాయకుల అసలు నైజాన్ని ఆయన…

Read More
Uranium in Mothers' Milk in Bihar

తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….

Read More

అన్న హీరో… చెల్లి జీరో – మూడు రాష్ట్రాల ముగ్గురు చెల్లెళ్ల ఆవేదన

సహనం వందే, పాట్నా:బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో లొల్లి మొదలైంది. లాలూ ప్రసాద్ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన కుమార్తె రోహిణి ఆచార్య ఎదుర్కొంటున్న అవమానాలు, ఆమె సోదరుడు తేజస్వి యాదవ్ వర్గంపై చేసిన విమర్శలు ఇప్పుడు దేశంలో హాట్ టాపిక్ అయింది. తన కిడ్నీని అపరిశుభ్రమైనది అన్నారని రోహిణి ఆవేదన వ్యక్తం చేయడం… అటువంటివారు తమ కిడ్నీలను పేదలకు దానం చేయాలని సవాల్ విసరడం రాజకీయాల్లో ప్రకంపనలు లేపుతుంది. ఈ…

Read More

వ్యూహం లేక మహా’ఓటమి’ – బీ’హోర్’లో ఆర్జేడీ, కాంగ్రెస్ బలహీన పోరాటం

సహనం వందే, పాట్నా:గెలుపులో వ్యూహాలు మాత్రమే ఉంటాయి. వీటిని వదిలేసి మిగిలిన విషయాలు ఎంత చెప్పుకున్నా వృధానే. ఎన్నికల సంగ్రామంలో వ్యూహం లేకపోతే విజయం దక్కదని అందరికీ తెలుసు. కానీ బీహార్ మహా కూటమి నేతలకు మాత్రం ఇది బుర్రకెక్కలేదు. ఓట్ల చోరీ… ఇతర పార్టీల ఓట్ల చీలిక వల్ల ఓడిపోయామని చెప్పుకుంటున్నప్పటికీ… అవతలిపక్షం వాళ్లకి అవన్నీ వ్యూహాల కిందే లెక్క. ఆ వ్యూహంలో భాగంగానే ఎన్డీఏ నాయకులు విజయం కోసం అస్త్రశస్త్రాలు సంధించారు. దీంతో బీహార్…

Read More

ఎగ్జిట్ హైప్… రిజల్ట్ డౌట్ – బీహార్ లో కమలం జోరు… కథ వేరు

సహనం వందే, పాట్నా:బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌పై నెలకొన్న ఏకపక్ష అంచనాలు విమర్శలకు తావిస్తున్నాయి. దైనిక్ జాగరణ్, మాట్రిజ్, పీపుల్స్ ఇన్‌సైట్, చాణక్య స్ట్రాటజీస్, పీపుల్స్ పల్స్ సహా మొత్తం తొమ్మిది ప్రముఖ సర్వే సంస్థలు బీహార్‌లో ఎన్డీయేదే తిరుగులేని అధికారం అని ముక్తకంఠంతో చెప్పాయి. ఈ అంచనాల ప్రకారం సరాసరి ఎన్డీయే కూటమి సుమారు 157 స్థానాలు దక్కించుకుంటుంది. అంటే అధికార పీఠం దక్కించుకోవడానికి అవసరమైన 122 స్థానాల మెజారిటీని చాలా తేలికగా దాటేస్తుందన్న మాట….

Read More

బీహార్ ఎన్నికల్లో అమ్మాయిల ఎర – ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ లీక్స్

సహనం వందే, పాట్నా:ఒకవైపు బీహార్‌లో ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు తెరవెనుక కొందరు ప్రజా ప్రతినిధులు చేస్తున్న దారుణాలు దేశాన్ని కుదిపేశాయి! ఎన్నికల సమయంలో లాబీయింగ్ కోసం… పెద్ద పెద్ద నేతలను తమ వైపు తిప్పుకునేందుకు అమ్మాయిలను సరఫరా చేయడం నివ్వెరపరిచింది. ప్రముఖ జాతీయ మీడియా ‘దైనిక్ భాస్కర్’ నిర్వహించిన ‘ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్’ బయటపెట్టిన రహస్యాలు ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వంటి ప్రజాప్రతినిధులు తమ విలాసాల కోసం ఏకంగా అమ్మాయిలను సరఫరా చేసే నెట్‌వర్క్‌ను ఆశ్రయిస్తున్నారట!…

Read More

దళిత్ రాక్స్… బీహార్ షేక్స్! – బీ’హోర్’లో ఓటింగ్ సునామీ!

సహనం వందే, పాట్నా:మొదటి దశ పోలింగ్ సందర్భంగా బీహారులో పల్లెల నుంచి పట్నాల వరకు ఒక అద్భుతం జరిగింది. ఏడు దశాబ్దాల బీహార్ చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాల ముందు క్యూ కట్టారు. సాయంత్రం చివరి బ్యాలెట్ పడే సమయానికి మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల్లో 64.7 శాతం ఓటింగ్ నమోదైంది. ఇది బీహార్ చరిత్రలోనే అత్యధిక శాతం. ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని 2020 పోలింగ్‌తో పోల్చి చూసినప్పుడు… మొదటి…

Read More

బీ’హోర్’లో కుబేరులు – వెయ్యి మంది అభ్యర్థులు కోటీశ్వరులే

సహనం వందే, బీహార్:బీహార్ అసెంబ్లీ ఎన్నికలు మరోసారి డబ్బు, పేదరికం మధ్య భారీ అంతరాన్ని చూపించాయి. మొత్తం 243 స్థానాలకు 2,600 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా… వీరి సగటు ఆస్తి విలువ 2020తో పోలిస్తే రెట్టింపు అయ్యింది. 2020 ఎన్నికల్లో అభ్యర్థుల సగటు ఆస్తి రూ.1.72 కోట్లు ఉండగా… 2025లో ఇది రూ. 3.35 కోట్లకు చేరింది. పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 42 శాతం (1081 మంది) కోటీశ్వరులే ఉండటం ఎన్నికల ముఖచిత్రాన్ని స్పష్టం చేస్తోంది….

Read More