కాంగ్రెస్ బడ్జెట్ ‘బడా జూట్’.. అబద్ధాల పుట్ట: హరీష్ రావు
తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు గుప్పించారు. భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాజకీయ ప్రసంగంలా ఉందని, పచ్చి అబద్ధాలు, అసత్యాలతో నిండి ఉందని ఆయన దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌ను ‘బడా జూట్’ బడ్జెట్‌గా అభివర్ణిస్తూ, కాంగ్రెస్ విశ్వసనీయతను కోల్పోయిందని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆకాశమంత హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తోందని హరీష్ రావు ఆరోపించారు. రేవంత్ రెడ్డి అసెంబ్లీలోనూ, బయటా అబద్ధాలే మాట్లాడుతున్నారని విమర్శించారు….