కోర్టుకే షాకిచ్చిన ఫుడ్ కమిషనర్! – నిలదీసిన న్యాయమూర్తికే చుక్కలు
సహనం వందే, ముంబై: ప్రైవేట్ హోటళ్లపై మాత్రమే పడుతున్నారంటూ సాక్షాత్తు ముంబై న్యాయమూర్తి నుంచి ఎదురుదాడి ఎదురైన వేళ, ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారామ్ ముండే వేసిన మాస్టర్ స్ట్రోక్ సంచలనం సృష్టించింది. కోర్టులకే చుక్కలు చూపిస్తూ కేవలం గంటల వ్యవధిలో హైకోర్టు ఆవరణలోని క్యాంటీన్లపైనే మెరుపు దాడి చేసిన ఆయన, లైసెన్సులు లేకుండా నడుస్తున్న వాటిని తక్షణమే మూసివేయించారు. కోర్టు గది నుంచి వంటగది దాకా రైడ్స్ముంబై నగరంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన…