టెక్ బ్రెయిన్స్‌కు తెలంగాణ ఆఫర్ – ఐడియా ఉంటే స్టార్టప్‌లకు జాక్‌పాట్!
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజలు రోజువారీ ఎదుర్కొంటున్న 7 ప్రాధాన్యతా సవాళ్లకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనేందుకు ప్రభుత్వం ఒక సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా తెలంగాణ ఇన్నోవేషన్ స్టార్టప్ ఛాలెంజ్‌ను లాంచ్ చేసి, నూతన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలను నేరుగా ఆహ్వానిస్తోంది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కర్టెన్ రైజర్ వేదికగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ కాంట్రాక్టర్లుగా మారే అరుదైన…