ఆయిల్ పామ్ మొక్కల్లో జన్యు లోపాలు

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్రంలో ఆయిల్ పామ్ తోటలు రైతులకు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో సుమారు 90 వేల ఎకరాల్లో సాగవుతున్న ఆయిల్ పామ్ తోటలు రైతులకు నిరాశ మిగిలిస్తున్నాయి. తెలంగాణ ఆయిల్ ఫెడ్ జోన్‌లో 1993 నుండి 2015 వరకు మంచి నాణ్యత గల మొక్కలను అందించినప్పటికీ, 2016 నుండి నర్సరీల ద్వారా సరఫరా చేసిన మొక్కల్లో గణనీయమైన శాతం (20% నుండి 50% వరకు) జన్యు…

Read More

కరోనా? కుట్రనా?

సహనం వందే, హైదరాబాద్: సింగపూర్, భారతదేశంలో కోవిడ్ జేఎన్.1 వేరియంట్ వ్యాప్తి చెందుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని పరీక్షించినప్పుడు ఈ వైరస్ బయటపడుతోందని చెబుతున్నారు. అయితే కరోనా వైరస్ వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా ఎండమిక్ దశలో ఉన్నప్పటికీ, అప్పుడప్పుడు అంతర్జాతీయంగా దాని వ్యాప్తిని మళ్ళీ ముందుకు తీసుకురావడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టడం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ తయారీ కంపెనీల స్వార్థ ప్రయోజనాల కోసం పన్నుతున్న కుట్రగా కొందరు తీవ్రంగా వ్యాఖ్యానిస్తున్నారు. కరోనా నిజంగానే…

Read More

కిమ్స్-ఉషాలక్ష్మి సెంటర్‌లో అందాల తారలు

సహనం వందే, హైదరాబాద్: భారతదేశంలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పిస్తూ, ఈ రంగంలో అపారమైన సేవ‌లందిస్తున్న ఉషాలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్ ఫౌండేషన్, కిమ్స్ – ఉషాలక్ష్మి సెంటర్ ఫర్ బ్రెస్ట్ డిసీజెస్‌ను మిస్ వరల్డ్ పోటీదారులు కొందరు మంగళవారం సందర్శించారు. సౌందర్యం కేవలం బాహ్య రూపానికే పరిమితం కాదని, సామాజిక సేవలో కూడా తమ వంతు పాత్ర పోషించగలమని ఈ సందర్శన ద్వారా వారు చాటిచెప్పారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ 2025 ప్రతినిధులకు కిమ్స్ గ్రూప్…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ!

సహనం వందే, హైదరాబాద్: ఆయిల్ ఫెడ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని రైతులు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని యోచిస్తున్నారు. ఆయిల్ ఫెడ్ లో అక్రమాలపై రాష్ట్ర వ్యవసాయ శాఖకు ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారెవరూ పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయిల్ ఫెడ్ లోని కొందరు అధికారులు ఇష్టారాజ్యంగా అక్రమాలకు పాల్పడినట్లు వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ కోరడమే సరైన పరిష్కారంగా రైతులు భావిస్తున్నారు. ‘రైతుల…

Read More

బీఆర్ఎస్‌ చీలికకు హరీష్ బీజాలు

సహనం వందే, హైదరాబాద్: రాజకీయ ఓనమాలు నేర్పించి ఈ స్థాయికి తీసుకొస్తే, తన సొంత మేనమామ కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచేందుకు కూడా హరీష్ రావు వెనుకాడడం లేదని జోరుగా ప్రచారం జరుగుతుంది. బీఆర్ఎస్‌ చీలికకు ఆయన బీజం వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కేటీఆర్ నాయకత్వాన్ని ఏమాత్రం అంగీకరించడానికి హరీష్ రావు సిద్ధంగా లేనట్టు చెబుతున్నారు. కేటీఆర్ కు పూర్తిస్థాయి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే తన రాజకీయ అడుగులు మరోరకంగా ఉంటాయని హరీష్ రావు తన…

Read More

వ్యవసాయశాఖలో కోవర్ట్

సహనం వందే, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల అమలుతీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ, రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతుండటం వెనుక వ్యవసాయశాఖలోని ఒకరిద్దరి హస్తం ఉందన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. పథకాల రూపకల్పన నుంచి అమలు వరకు జరుగుతున్న తప్పిదాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా? లేక ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలనే దురుద్దేశంతో కొందరు కావాలనే చేస్తున్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా…

Read More

నితిన్ ‘తమ్ముడు’

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం తమ్ముడుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 4న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి మూడ్ ఆఫ్ తమ్ముడు అనే పాత్రల పరిచయ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో చిత్ర కథాంశానికి…

Read More

దళారులకు మార్క్‌ఫెడ్‌ అండదండ

సహనం వందే, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మార్క్‌ఫెడ్ ఎండి శ్రీనివాస్ రెడ్డి… వీళ్లంతా జొన్న రైతుల కోసం కృషి చేస్తుంటే కిందిస్థాయిలో కొందరు అధికారులు మాత్రం దళారులకు అమ్ముడుపోతున్నారు. జొన్న రైతులకు మద్దతు ధర ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించారు. జొన్న కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగకూడదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెప్తున్నప్పటికీ అధికారులు మాత్రం తమ దందా కొనసాగిస్తున్నారు. హైదరాబాదు…

Read More

తెలంగాణలో జపానీస్ భాష

సహనం వందే, హైదరాబాద్: ఇటీవల జపాన్ దేశ పర్యటన సందర్భంగా తెలుసుకున్న విషయాల మేరకు ఆ దేశానికి అవసరమైన మానవ వనరులను సమకూర్చడానికి వీలుగా తెలంగాణలో జపనీస్ భాషను నేర్పించాలని సంకల్పించామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు, అనుసరిస్తున్న విధానాలు దేశానికి దిశానిర్దేశం చేస్తున్నాయని స్పష్టం చేశారు. సామాజిక న్యాయంతో పాటు ఇతర అంశాల్లో తెలంగాణ మాడల్‌ను కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించాల్సిన పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. బెంగుళూరు…

Read More