క్యాబినెట్ లో మెడికోలపై నివేదిక – మంత్రి దామోదర వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:జూనియర్ డాక్టర్ల సమస్యలపై ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించినట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ తెలిపారు. ఈ అంశాలపై సమగ్ర నివేదికను 24న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టి, సిఫార్సులతో సహా చర్చించనున్నట్లు ఆయన హామీ ఇచ్చారు. కేబినెట్ సమావేశ ఫలితాలు, తదుపరి చర్యలను వివరించడానికి 25న టీ-జుడా ప్రతినిధులతో మరో సమావేశం నిర్వహిస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం జూడా నాయకులు డాక్టర్ ఐజాక్…

Read More

‘ఆ నూనె వాడితే ప్రాణాలేం పోవు’ – వ్యాపారి వ్యాఖ్య

సహనం వందే, హైదరాబాద్:రాష్ట్రంలో కాలం చెల్లిన బ్రాండెడ్ నూనె ప్యాకెట్ల విక్రయాలు కలకలం రేపుతున్నాయి. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఒక వినియోగదారుడికి ఎదురైన చేదు అనుభవం ఈ దారుణమైన వాస్తవాన్ని వెలుగులోకి తెచ్చింది. నిర్మల్ లో గారెలు చేసుకుని తినాలని ఆశగా నూనె ప్యాకెట్లు కొనుగోలు చేసిన అతనికి, ఇంటికి వెళ్లాక చూసేసరికి ఆ ప్యాకెట్ల గడువు గత మే నెలలోనే ముగిసిందని తెలిసి…

Read More

గోమాతకు అండగా ప్రభుత్వం – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణకు సమగ్ర విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవాలని ఆదేశించారు. గోవుల సంరక్షణే లక్ష్యంగా విధానాల రూపకల్పన ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సమగ్ర అధ్యయనానికి ఆదేశం!పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సబ్యసాచి…

Read More

మెడికోలను బెదిరిస్తున్న యాజమాన్యాలు…

సహనం వందే, హైదరాబాద్:జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) నిబంధనల ప్రకారం స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ ధర్నా చేస్తున్న మెడికోలను ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు బెదిరిస్తున్నాయి. ఇలా ధర్నాలు చేస్తే మీ డాక్టర్ డిగ్రీ ఎలా వస్తుందో చూడండని వార్నింగ్ ఇస్తున్నాయి. సోమవారం వికారాబాద్ లోని మహావీర్ మెడికల్ కాలేజీకి చెందిన ఎంబీబీఎస్ హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులు ధర్నా చేపట్టారు. తమకు స్టైఫెండ్ ఇవ్వాలని కోరారు. దీంతో కాలేజీ యాజమాన్యం చెందిన ప్రతినిధి ఒకరు వారి…

Read More

గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ లో పెద్దలెక్కడ?

సహనం వందే, హైదరాబాద్:సినిమా పరిశ్రమకు తామే పెద్దలమని చెప్పుకుంటారు. కళామతల్లి బిడ్డలమని డబ్బా కొట్టుకుంటారు. పొద్దున్న లేస్తే నీతి కబుర్లు చెబుతుంటారు. పైనుంచి దిగివచ్చిన దేవదూతలుగా భావిస్తుంటారు. అలాంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన గద్దర్ సినీ అవార్డుల ఫంక్షన్ కు హాజరు కాకపోవడంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాదులో ఉంటూ… ఇక్కడి భూములపై రాయితీలు అనుభవిస్తూ… సినిమా టిక్కెట్లకు ధరలు పెంచుకుంటూ వందల వేల కోట్లకు పడగలెత్తిన మన కళామతల్లులు…

Read More

మంత్రుల గుండెల్లో రేవంత్ రెడ్డి- శాఖల కేటాయింపు వెనుక వ్యూహం

సహనం వందే, హైదరాబాద్:మంత్రివర్గ విస్తరణ తర్వాత శాఖల కేటాయింపు ప్రకటించని ఆ రెండు రోజులు రాష్ట్రంలోని మంత్రులంతా నిద్రలేని రాత్రులు గడిపారు. తమ శాఖ మారుతుందని కొందరు… అప్రధాన్య శాఖలోకి మారుస్తారని మరికొందరు… ఇద్దరు డిప్యూటీ సీఎంలు వస్తారని ఇంకొందరు… ఇలా ఒత్తిడితో కూడిన వాతావరణంలోకి వెళ్ళిపోయారు. చివరకు ముఖ్యమంత్రి ఎలాంటి ప్రక్షాళన లేకుండానే… శాఖలు మార్చకుండానే… తన వద్ద ఉన్న శాఖలను కొత్త వారికి ఇచ్చి వారిని అత్యంత కూల్‌గా ఉంచారు. దీంతో పాత మంత్రులు…

Read More

వేణుస్వామి మైండ్ గేమ్ – సెలబ్రిటీల గోప్యతపై దాడి

సహనం వందే, హైదరాబాద్:ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం సంఘటనను తాను ముందే చెప్పానని జ్యోతిష్యురాలు శర్మిష్ఠ చేసిన పిచ్చి వ్యాఖ్యలపై దేశం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. జ్యోతిష్యం చెప్తున్నారా? చావు ముహూర్తాలు పెడుతున్నారా? అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అచ్చం అలాగే తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి జ్యోతిష్యం చెబుతూ సెలబ్రిటీలతో మైండ్ గేమ్ ఆడుతున్నాడు. వారికి మానసిక వేదన కలిగిస్తూ కోట్లు గడుస్తున్నాడు. జోస్యం చెప్పి… దాని విరుగుడుకు యజ్ఞ యాగాల పేరుతో వసూళ్లు…

Read More

అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ – రాజకీయ రంగ ప్రవేశం

సహనం వందే, హైదరాబాద్:భారత క్రికెట్ దిగ్గజం మహమ్మద్ అజహరుద్దీన్ కుమారుడు అసదుద్దీన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తెలంగాణ కాంగ్రెస్‌ జనరల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 35 ఏళ్ల అసదుద్దీన్ గతంలో హైదరాబాద్ కోల్ట్స్, గోవా వంటి జట్లకు ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. తన రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నుండి అపారమైన స్ఫూర్తి పొందినట్లు అసదుద్దీన్ వెల్లడించారు. రాహుల్ గాంధీ సామాజిక న్యాయం పట్ల, పార్టీ విలువల పట్ల కనబరుస్తున్న నిబద్ధత తనను ఎంతగానో…

Read More

గుడ్డు గోల్‌మాల్‌ – మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖలో డ్రామా

సహనం వందే, హైదరాబాద్:మహిళా శిశు సంక్షేమ శాఖలో జరుగుతున్న గుడ్డు గోల్‌మాల్‌ షాక్‌కు గురిచేస్తోంది. పాత కాంట్రాక్టర్లకే గుడ్ల సరఫరా కట్టబెడుతూ, కొత్త టెండర్ల ఎంపికలో జాప్యం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్‌వాడీ కేంద్రాలకు 36 కోట్లకు పైగా కోడిగుడ్ల సరఫరా కోసం ఏటా టెండర్లు జారీ చేయాలి. కానీ ఈ ఏడాది మార్చిలో జారీ చేసిన టెండర్లు పాత కాంట్రాక్టర్ల కోసమే అన్నట్లుగా నిబంధనలు వచ్చాయి. దీనిపై పౌల్ట్రీ రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా,…

Read More

మెడికల్ కౌన్సిల్ – నకిలీ వైద్యులపై కొరడా

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి.ఎం.సి.) ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న 15 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలుగత నెలలో జరిగిన ఈ తనిఖీల అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది. ఈ తనిఖీలను…

Read More