రక్తచరిత్రకు నేతల తహతహ – గతంలో జగన్ ‘రప్పా రప్పా’ ఫ్లెక్సీ వివాదం

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:జనాన్ని రెచ్చగొట్టడానికి మన నేతలు కత్తులు వాడుతున్నారు. పరోక్షంగా నెత్తుటి రాజకీయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది. సినిమాల్లోనూ నిషేధించాల్సిన కత్తుల నెత్తురు చిత్రాలను… బయట కూడా ప్రదర్శించడం పట్ల విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలో వైసీపీ కార్యకర్తలు పుష్ప సినిమాలోని రప్పా రప్పా డైలాగును ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేయడాన్ని అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యతిరేకించారు. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మొన్న హైదరాబాదులో జరిగిన…

Read More

తాత్కాలిక బదిలీల తిరకాసు – ఉద్యోగుల బదిలీలకు కఠిన నిబంధనలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్లపై జారీ చేసిన మార్గదర్శకాలపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట కన్నా నిరాశనే మిగుల్చుతోంది. క్యాబినెట్ సబ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పలు అంశాలు ఉద్యోగుల ఆశలకు అడ్డుకట్ట వేసినట్లు స్పష్టమవుతోంది. కఠినమైన అర్హతా నిబంధనలు, పరిమిత కాలపరిమితి, ఆర్థిక ప్రయోజనాల లేమి వంటివి ఉద్యోగుల మధ్య అసంతృప్తిని పెంచుతున్నాయి. అర్హత కన్నా అనర్హతలే ఎక్కువ…ప్రభుత్వం తాత్కాలిక బదిలీల కోసం…

Read More

పేదల వైద్యంపై పిడుగు – ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్

సహనం వందే, హైదరాబాద్/అమరావతి:తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవలకు బ్రేక్ పడనుంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ. 2500 కోట్లు, తెలంగాణలో రూ.1400 కోట్ల బకాయిలు చెల్లించకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవలను నిలిపివేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణలో ఆరోగ్యశ్రీ సేవలను బంద్ చేయాలని నిర్ణయించాయి. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్టీఆర్ పథకం కింద ఉన్న ఓపీడీ సేవలు నిలిచిపోనున్నాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం… పేదలకు శాపంప్రైవేటు ఆస్పత్రులు పలుమార్లు విజ్ఞప్తులు చేసినా రాష్ట్ర ప్రభుత్వాలు కనీస స్పందన చూపడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో…

Read More

ప్రేమతో మీ అనుష్క… – అభిమానులకు ప్రత్యేకంగా లేఖ

సహనం వందే, హైదరాబాద్:సినీ తార అనుష్క శెట్టి తన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఒక అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తన తాజా చిత్రం ఘాటి విడుదలైన కొద్ది రోజులకే ఆమె సోషల్ మీడియాకు విరామం ప్రకటించారు. ‘ఎక్కడ మొదలు పెట్టానో మళ్ళీ అక్కడికే’ అంటూ ఆమె పెట్టిన భావోద్వేగమైన పోస్ట్ అభిమానుల మనసులను కదిలించింది. ఈ నిర్ణయం సినిమా వర్గాల్లో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఆమె త్వరగా తిరిగి రావాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. ఘాటి…

Read More

సీడ్ సర్టిఫికేషన్ అథారిటీకి అవార్డు

సహనం వందే, హైదరాబాద్:హైదరాబాద్‌లో జరిగిన ఇండో-ఆఫ్రికా సమ్మిట్‌లో తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ (టీఎస్‌సీఏ) విత్తన పరీక్ష-ధ్రువీకరణ ఎక్సలెన్సీ అవార్డును గెలుచుకుంది. భారత ఆహార వ్యవసాయ కౌన్సిల్ (ఐసీఎఫ్‌ఏ) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా విత్తన రంగంలో విశేష సేవలందించిన సంస్థలకు ఈ అవార్డును అందజేశారు. అందులో భాగంగా తెలంగాణ సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్ డాక్టర్ కేశవులు అవార్డు అందుకున్నారు. గ్లోబల్ సీడ్ హబ్‌గా ఎదుగుతున్న తెలంగాణకు ఇది గర్వకారణం. విత్తన రంగంలో ఆదర్శం…తెలంగాణ…

Read More

‘శ్రీనివాసా’ గోవిందా – ఎట్టకేలకు ఎంఎన్ జే డైరెక్టర్ తొలగింపు

సహనం వందే, హైదరాబాద్‌:ఎట్టకేలకు ఎంఎన్ జే క్యాన్సర్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసులును రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. కొత్త ఇంచార్జి డైరెక్టర్ గా డాక్టర్ జోసెఫ్ బెంజిమెన్ ను నియమించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘సహనం వందే’, ‘ఆర్టికల్ టుడే’ డిజిటల్ పేపర్లు రాసిన వరుస కథనాలతో డాక్టర్ శ్రీనివాసులుపై వేటు పడింది. ఆయన డైరెక్టర్ గా కొనసాగడంపై ‘సహనం వందే’ https://sahanamvande.com/?p=6557, ‘ఆర్టికల్ టుడే’ https://articletoday.in/ shock-to-dr-srinivasulu-as-dopt-sacks-mnj-director/ డిజిటల్…

Read More

సీపీఎం నేత నర్రా రమేష్ మృతి

సహనం వందే, ఖమ్మం:ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.

Read More

హైదరాబాదులో మార్వాడీపై దాడి – బీజేపీలో అంతర్గత గొడవలే కారణం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో మార్వాడీ గో బ్యాక్ ఉద్యమం ఊపందుకున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ఒక మార్వాడీపై దాడి జరగడం కలకలం రేపింది. ఈ దాడికి రాజకీయ విభేదాలే కారణమని తెలుస్తోంది. భారతీయ జనతా పార్టీలో నెలకొన్న గ్రూపు తగాదాలే ఈ దాడికి కారణమని స్పష్టమవుతోంది. ఆర్కేపురం కార్పొరేటర్ రాధ భర్త ధీరజ్ రెడ్డి, విజయ్ దేవడా అనే మార్వాడీపై దాడి చేశారు. ఆర్కేపురంలో విజయ్ దేవడా ఏర్పాటు చేసిన వినాయకుడి దర్శనానికి సరూర్ నగర్ బీజేపీ…

Read More

అవినీతి అనకొండ హరీష్ – శివాలెత్తిన కవిత… బావపై తీవ్ర ఆరోపణలు

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా ఊహించని మలుపు తిరిగాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణలు ఒకవైపు కొనసాగుతుండగా బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత కలహాలు బయటపడ్డాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేశాయి. మాజీ మంత్రి, తన బావ హరీశ్ రావుతో పాటు మాజీ ఎంపీ సంతోష్ రావులే కాళేశ్వరంలో జరిగిన అవినీతికి మూల కారణమని ఆమె తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వారి స్వార్థం, అవినీతి వల్లే…

Read More

వ్యవసాయ విస్త’రణం’అధికారులు – ఏఈఓల ప్రమోషన్ల చిక్కుముడి

సహనం వందే, హైదరాబాద్:వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) పదోన్నతులు అంతులేని చిక్కుముడిగా మారాయి. వ్యవసాయంలో డిగ్రీ (బీఎస్సీ అగ్రికల్చర్) పూర్తి చేసి నేరుగా ఏఈఓలుగా నియమితులైన వారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని గ్రాడ్యుయేట్ ఏఈఓల సంఘం ఆరోపించింది. మరోవైపు కేవలం డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇన్-సర్వీస్‌లో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి సీనియారిటీని తొక్కేస్తున్నారని ఆ సంఘం మండిపడుతోంది. దీనివల్ల దాదాపు 750 మంది గ్రాడ్యుయేట్ ఏఈఓలు తమ పదోన్నతుల కోసం తొమ్మిదేళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారని…

Read More