నేపాల్ వీధుల్లో సూద్ అడుగులు! – వరద బాధితులకు సోను సూద్ అభయం
సహనం వందే, నేపాల్: కష్టమొచ్చినప్పుడు సరిహద్దులు లెక్కచేయకుండా ముందుకెళ్లే అసలు సిసలు రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నేపాల్ దేశాన్ని వణికించిన భయంకరమైన వరద విలయంలో సర్వస్వం కోల్పోయిన ప్రజల రోదనలకు చలించిపోయి స్వయంగా రంగంలోకి దిగి అక్కడి బాధితులకు అండగా నిలుస్తున్నారు. సరిహద్దులను దాటిన సోనూసూద్ సేవలు…కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులకు దేవుడిగా నిలిచిన నటుడు సోనూసూద్… ఇప్పుడు సరిహద్దులు దాటి పక్కనే ఉన్న నేపాల్ దేశంలోని వరద…