పెళ్లి కాకుండానే కలిసుండొచ్చు – సహజీవనం పెళ్లితో సమానం
సహనం వందే, న్యూఢిల్లీ: నగరాల్లో లివిన్-ఇన్ రిలేషన్‌షిప్‌లు సర్వసాధారణమైపోతున్నాయి. పెళ్లికి ముందే ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి చాలామంది జంటలు సహజీవనం మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. అయితే ఇలాంటి బంధాలను మన సమాజం, సంప్రదాయవాద కుటుంబాలు అంగీకరించలేకపోతున్నాయి. కొందరైతే దీనిని తమ పరువు ప్రతిష్టలకు భంగకరంగా భావించి తీవ్రమైన వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. సరిగ్గా ఇలాంటి ఒక అంశంపై తాజాగా ఢిల్లీ హైకోర్టులో కీలకమైన విచారణ జరిగింది. ఇద్దరు మేజర్లు అయిన ఒక జంట తమకు ప్రాణభయం ఉందంటూ కోర్టును…