మెడికల్ ఫీ’జులుం’పై ఉక్కుపాదం – రంగంలోకి దిగిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
సహనం వందే, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనపు ఫీజులు వసూలు చేస్తూ చేస్తున్న దోపిడీపై కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం తీవ్రంగా స్పందించింది. నాలుగున్నరేళ్ల కోర్సు కాలానికి మించి ఫీజులు అడగవద్దని స్పష్టం చేస్తూనే ఇంటర్న్‌షిప్ అడ్డుకుంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలను హెచ్చరించింది. ప్రభుత్వం, ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధనల అమలే పరమావధిగా శనివారం ఈ కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనప్రభుత్వ ఉత్తర్వులను తుంగలో తొక్కి కొన్ని ప్రైవేట్…