జాతీయ ‘ఉన్మాద’ గీతాలు – ఫుట్ బాల్ ఆటలో హింసాత్మక పాటలు
సహనం వందే, హైదరాబాద్: ప్రపంచకప్ ఫుట్బాల్ మైదానాలు క్రీడాస్ఫూర్తికి బదులు యుద్ధ క్షేత్రాలను తలపిస్తున్నాయి. శాంతిని పంచాల్సిన జాతీయగీతాలు భయంకరమైన రక్తపాతాన్ని, మారణహోమాన్ని గుర్తుచేస్తున్నాయి. మెజారిటీ దేశాల గీతాల్లో యుద్ధం, మరణాల ప్రస్తావనలు ఉండటం క్రీడా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. దీనిపై రాజకీయ విశ్లేషణ ఇది. యూరప్ దేశాల రక్తదాహంసామ్రాజ్యవాద చరిత్ర కలిగిన యూరప్ దేశాల జాతీయగీతాల్లో ఇప్పటికీ రక్తదాహం స్పష్టంగా కనిపిస్తోంది. ఫ్రాన్స్ జాతీయగీతమైన లా మార్సెలైజ్ వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. శత్రువులు మీ భార్యాపిల్లల గొంతులు…