నారీ నారీ… నయవంచనకు బలి – ఇష్టం లేదని చెప్పడమే మహిళకు కష్టమా?
సహనం వందే, హైదరాబాద్: భారతీయ మహిళల జీవితాల్లో ‘నో’ చెప్పడం ఎంత కష్టమో ఈ సర్వే చెబుతోంది. బయట, ఇంట్లో, ఆఖరికి పని చేసే చోట కూడా మహిళలు తమ ఇష్టాయిష్టాలను చెప్పలేకపోతున్నారు. తరతరాల నిశ్శబ్దం ఇప్పుడు బద్దలవుతోంది. ఒక కొత్త అధ్యయనం మన సమాజంపై ప్రశ్నాస్త్రాలను సంధిస్తోంది. మహిళల గొంతుకలు ఇప్పుడు స్వేచ్ఛ కోసం నినదిస్తున్నాయి. కచ్చితమైన అడుగుఇండియా టుడే, సీ-ఓటర్ సంస్థలు దేశవ్యాప్తంగా ఒక సర్వే చేపట్టాయి. దీని కోసం 6379 మంది మహిళలను…