జెన్ జెడ్ బుక్ రీడింగ్ – మారుతున్న నేటి తరం… పుస్తకమే లోకం
సహనం వందే, హైదరాబాద్: నేటి డిజిటల్ యుగంలో యువత కేవలం సోషల్ మీడియా, రీల్స్ కే పరిమితమవుతున్నారనే అభిప్రాయం చాలామందిలో ఉంది. కానీ ఆ ఆలోచనను తలకిందులు చేస్తూ జెన్ జెడ్ తరం పుస్తక పఠనం వైపు వేగంగా అడుగులు వేస్తోంది. న్యూఢిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ వేదికగా నేషనల్ బుక్ ట్రస్ట్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, భారతీయ యువత పఠన అలవాట్లలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. కేవలం అకడమిక్, సిలబస్ పుస్తకాలకే పరిమితం…