ఆరు వేల కోట్ల గణేషుడు – హైదరాబాద్‌లో మైండ్ బ్లోయింగ్ బిజినెస్
సహనం వందే, హైదరాబాద్: సాధారణంగా ఏదైనా పాప్ సింగర్ మ్యూజిక్ కన్సర్ట్ ఉందంటే వేలకు వేలు పెట్టి టికెట్లు కొంటారు. కలర్‌ఫుల్ బ్యాండ్లు వేసుకుని డ్యాన్స్‌లు చేస్తారు. కానీ రూపాయి టికెట్ లేకుండా, ఎలాంటి డీజేలు లేకుండా మన హైదరాబాద్ రోడ్ల మీద అంతకు మించిన జోష్‌తో జనాలు పూనకాలతో ఊగిపోతున్నారు! ఏంటి కథ అనుకుంటున్నారా? అంతా మన లంబోదరుడి రాక కోసమే. పెద్ద పండగలా ‘ఆగమనం’ఒకప్పుడు గణేష్ చతుర్థి వస్తుందంటే కేవలం వీధి చివర పందిరి…