Tata Trust Money to BJP

టాటా ట్రస్ట్… బీజేపీ లూట్ – కాషాయం ఖజానాకు గుట్టలుగా నిధులు

సహనం వందే, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సంచలన తీర్పుతో ఎన్నికల బాండ్ల వ్యవహారంపై తెరపడింది అనుకుంటున్న తరుణంలో రాజకీయ పార్టీలకు నిధుల ప్రవాహం మరో కొత్త రూపంలో కొనసాగుతోంది. కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూపు ఆధీనంలో ఉన్న ప్రొగ్రెసివ్ ఎలక్టోరల్ ట్రస్ట్ (పీఈటీ) ద్వారా 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారీగా రూ. 915 కోట్ల విరాళాల పంపిణీ జరిగింది. అందులో 83 శాతం వాటా ఏకంగా అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఖాతాలోకి చేరింది. టాటా ట్రస్ట్…

Read More
Apple Opposes SancharSathi

యాపిల్‌ డోంట్ కేర్ – సంచార్ సాథీ యాప్ షరతుల తిరస్కరణ

సహనం వందే, హైదరాబాద్: సంచార్ సాథీ ప్రీఇన్‌స్టాలేషన్‌పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ప్రీ ఇన్‌స్టాలేషన్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది. ఈ యాప్ ఆప్షన్ మాత్రమేనని వెల్లడించింది. అయినప్పటికీ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటున్నారు. అయితే ఈ యాప్ విషయంలో యాపిల్‌ సంస్థ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ తయారీదారులు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారనేది చర్చనీయాంశంగా మారింది….

Read More
PG Medical Seats

కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

సహనం వందే, న్యూఢిల్లీ:దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది. రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613,…

Read More
Sexual Content Hacking

బెడ్‌రూమ్స్ హ్యాకింగ్ – ఇళ్లల్లో అమర్చుకున్న కెమెరాల హైజాక్

సహనం వందే, దక్షిణ కొరియా: దక్షిణ కొరియాలో ఓ భయంకరమైన సైబర్ నేరం వెలుగు చూసింది. తమ ఇళ్లలో, ఆఫీసుల్లో భద్రత కోసం అమర్చుకున్న లక్షా 20 వేలకు పైగా ఐపీ కెమెరాలు హ్యాకింగ్ అయ్యాయి. సీసీటీవీకి ప్రత్యామ్నాయంగా చవకగా దొరికే ఈ హోమ్ కెమెరాలను అడ్డుపెట్టుకుని కొందరు దుండగులు ప్రజల వ్యక్తిగత జీవితాలను రికార్డ్ చేశారు. లైంగికపరమైన కంటెంట్‌ను దొంగిలించి వాటిని అమ్ముకుంటూ డబ్బు దండుకున్నారు. ఇళ్లు, వ్యాపార సంస్థలు, చిన్న వ్యాయామ సెంటర్లు, గైనకాలజిస్ట్…

Read More
Nellore Lady Don

గంజాయి రాణి దారుణ హత్యలు – నెల్లూరులో సీపీఎం నేతను చంపిన కసాయి

సహనం వందే, నెల్లూరు:నెల్లూరు జిల్లా కల్లూరుపల్లికి చెందిన అరవ కామాక్షి అనే లేడీ డాన్ గంజాయి దందాకు అడ్డుగా వస్తున్నాడని భావించి సీపీఎం నాయకుడు కె. పెంచలయ్య (38)ను దారుణంగా హత్య చేయించింది. గంజాయి విక్రయాలను అడ్డుకుంటున్న పెంచలయ్యపై కక్ష పెంచుకున్న ఈ ముఠా గత శుక్రవారం సాయంత్రం ఆయన్ను అడ్డగించి కత్తులతో పొడిచి చంపింది. ఈ లేడీ డాన్ దందాలకు కొంతమంది పోలీసులు సహకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలతో నెల్లూరులో రౌడీయిజం, గంజాయి దందాలు…

Read More
Sandeep Sandilya IPS

‘చెత్త’ వాడితో ఐపీఎస్ దోస్తీ – ఢిల్లీలో మారువేషంలో ఏడు రోజులు

సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డ్రగ్స్ దందా నడుపుతున్న భారీ నైజీరియన్ ముఠా గుట్టును తెలంగాణ ఈగల్ బృందం, ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఛేదించాయి. ఈ మెగా ఆపరేషన్ విజయానికి ఈగల్ డైరెక్టర్ సందీప్ శాండిల్య ఐపీఎస్ చేపట్టిన సాహసోపేతమైన అండర్‌కవర్ మిషన్. ఈ డ్రగ్స్ దందా మూలాలను వెలికితీయడానికి ఆయన ఏకంగా ఏడు రోజులపాటు మారువేషంలో నైజీరియన్ల డ్రగ్స్ అడ్డాలోనే మకాం వేశారు. ఈ బృందం స్థానిక ప్రజల సహకారాన్ని తీసుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా…

Read More
One Dollar reaches Rs.89.48

రూపాయి ‘క్రాష్’తో ఆర్థిక విధ్వంసం – కాపాడే ఆర్థిక వైద్యులు ఎవరు?

సహనం వందే, ముంబై: దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి రూపాయి విలువ రోజురోజుకూ పాతాళానికి పడిపోతోంది. ఒక్క అమెరికన్ డాలర్ విలువ ఏకంగా రూ. 89.48 దాటి కొత్త రికార్డు సృష్టించింది. ఇది కేవలం ఒక సంఖ్య కాదు… దేశ ఆర్థిక శక్తికి అద్దం పట్టే చేదు నిజం. రూ. 90 అనే ముఖ్యమైన మార్క్ ఇప్పుడు అందరినీ భయపెడుతోంది. రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడూ మార్కెట్లోకి డాలర్లు అమ్మి రూపాయిని పైకి లేపే ప్రయత్నం చేసినా…

Read More
Uranium in Mothers' Milk in Bihar

తల్లి పాలలో విషపు జాడలు – ఢిల్లీ ఎయిమ్స్ పరిశోధనలో దారుణ నిజాలు

సహనం వందే, బీహార్: పిల్లలకు అమృతం వంటి తల్లి పాలే ఇప్పుడు విషంగా మారిపోయాయి. పసికందుల నోటిలోకి పాలు కాదు… నిశ్శబ్దంగా యురేనియం వంటి ప్రాణాంతక విషాన్ని చేరుస్తున్న అత్యంత భయంకరమైన నిజాన్ని ఒక కొత్త అధ్యయనం బట్టబయలు చేసింది. బీహార్ రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి సేకరించిన తల్లి పాలలో యూరేనియం జాడలు కనిపించడం రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థ ఎంత దారుణంగా దిగజారిందో… పౌరుల ప్రాథమిక ఆరోగ్య భద్రతకు ఎంత ముప్పు పొంచి ఉందో తెలియజేస్తోంది….

Read More
Billionaires Brothers Nithin Chethan $570 Million Settlement by Supreme Court

వేల కోట్లు మోసం… కోర్టు అభయం – 13 వేల కోట్ల మోసకారులకు సుప్రీం బిగ్ ఆఫర్

సహనం వందే, న్యూఢిల్లీ: బ్యాంకులను ముంచిన బిలియనీర్ సోదరులు నితిన్, చేతన్ సందేసరాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనం రేపుతుంది. దాదాపు రూ. 13 వేల కోట్ల బ్యాంకు మోసం కేసులో దేశం విడిచి పారిపోయిన నితిన్, చేతన్ ల పై సుప్రీంకోర్టు వేసిన బ్రేక్ ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. వేల కోట్లు కొల్లగొట్టిన వారికి అత్యున్నత న్యాయస్థానం ఊరటనిస్తూ మొత్తం అప్పులో మూడో వంతు చెల్లిస్తే క్రిమినల్ కేసులన్నీ రద్దు చేస్తామంటూ ఆదేశాలు ఇవ్వడం…

Read More