రేవంత్ అంటే కేసీఆర్‌కు భయమా? – రాజకీయ దురంధరుడి అస్త్ర సన్యాసం
సహనం వందే, హైదరాబాద్: అసెంబ్లీకి మొహం చాటేయడం… ప్రశ్నించాల్సిన చోట పారిపోవడం ఏరకమైన నాయకత్వం? లక్షలాది మంది ప్రజల సమస్యలను గాలికొదిలేసి, బూతులంటూ సాకులు చెప్పి ఇంట్లో కూర్చుంటే జనం ఊరుకుంటారా? రాజకీయ పండితుడు భయపడి సభకు రానంటూ మొండికేస్తున్నారు. ఈ రాజకీయ నాటకాల వెనుక అసలు కుట్ర ఏంటి? కాంగ్రెస్ ధర్నాలు… కేసీఆర్ సాకులుతెలంగాణలో ప్రజాస్వామ్యం ఏ స్థాయికి దిగజారిపోయిందో చూడటానికి ఈ పరిణామాలే తిరుగులేని సాక్ష్యం. అసెంబ్లీకి రావాలని ఒకరు ధర్నాలు చేస్తుంటే, ఆ…