పోలీస్ గుట్టుపై సుప్రీం చివాట్లు – సీసీటీవీ కెమెరాల ఏర్పాటులో నిర్లక్ష్యంపై ఫైర్

సహనం వందే, న్యూఢిల్లీ:పట్టణాలు, నగరాల్లోని పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఐదేళ్ల నాటి ఆదేశాలు ఇప్పటికీ అమలు కాకపోవడంపై దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థల కార్యాలయాల్లో విచారణ గదుల్లో కెమెరాలు ఉండాల్సిన చోట లేకపోవడం, కొన్నిచోట్ల ఉన్నా పనిచేయకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల పెరుగుతున్న కస్టడీ మరణాల నేపథ్యంలో ఈ అంశాన్ని కోర్టు తిరిగి తెరపైకి తెచ్చి ప్రభుత్వాలపై ఒత్తిడి…

Read More

కమ్యూనిస్టు కారులో మోడీ షికారు – చైనాలో హాంగ్చీ ఎల్5లో మోడీ ప్రయాణం

సహనం వందే, చైనా:షాంఘై సహకార సదస్సు కోసం చైనా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోడీకి అక్కడి ప్రభుత్వం అరుదైన గౌరవాన్ని అందించింది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సొంతంగా వాడే అత్యంత ప్రతిష్టాత్మకమైన కారు హాంగ్చీ ఎల్5 లిమోసిన్‌లో ఆయన ప్రయాణించారు. ఈ కారు కేవలం ఉన్నత స్థాయి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులకు, ఎంపిక చేసిన విదేశీ అతిథులకు మాత్రమే కేటాయించేది. 2019లో జిన్‌పింగ్ భారత్‌క వచ్చినప్పుడు ఇదే కారులో ప్రయాణించారు. ఈ కారు కేవలం…

Read More

ప్రవక్త బోధ… గోవధ నిషేధ – సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ సంచలనం

సహనం వందే, ముంబై:బాలీవుడ్ లెజెండరీ రైటర్, సల్మాన్ ఖాన్ తండ్రి సలీం ఖాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో పెను దుమారం రేపుతున్నాయి. తమ కుటుంబం ఎప్పుడూ గోమాంసం తినలేదని, తమ ఇంట్లో గోమాంసం వంటకం ఎప్పుడూ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ్టి వరకు తమ ఇంట్లో గోమాంసం వండలేదని, చాలా మంది ముస్లింలు అది చవకగా దొరుకుతుందని తింటారని ఆయన అన్నారు. ప్రవక్త మహమ్మద్ బోధనల ప్రకారం ఆవు పాలు తల్లిపాలకు సమానమని,…

Read More

మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

మహారాష్ట్రలో బీసీ కోటా మంటలు – రిజర్వేషన్ల కోసం మరాఠాల ఉద్యమం

సహనం వందే, ముంబై:మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ ఉద్యమం మరోసారి ఉద్ధృతమైంది. మరాఠా కోటా కోసం పోరాడుతున్న నాయకుడు మనోజ్ జరంగే ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారు. మరాఠా సామాజిక వర్గానికి సామాజిక, విద్యాపరమైన వెనుకబాటు తనం (ఎస్‌ఈబీసీ) హోదా కల్పించి, విద్య, ఉద్యోగాలలో 10 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ దీక్షకు వేలాది మంది మరాఠాలు, రైతులు, యువత మద్దతుగా కదులుతున్నారు. జరంగే ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, పోరాటం నుంచి…

Read More

అద్దెకు అమ్మమ్మ… కిరాయికి తాతయ్య – వృద్ధాశ్రమాల్లో బాగోద్వేగాల అమ్మకం

సహనం వందే, ఆగ్రా:ఆగ్రాలోని రామ్‌లాల్ వృద్ధాశ్రమం తెరపైకి తెచ్చిన వృద్ధులను కిరాయికి ఇచ్చే కొత్త పథకం తీవ్ర వివాదాలకు దారితీస్తోంది. ఇది మంచి ఉద్దేశంతో మొదలైందని ఆశ్రమ నిర్వాహకులు ఎంత చెబుతున్నా దీని వెనుక దాగిన చీకటి కోణాలు భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఒంటరి పిల్లలకు కుటుంబ సాంగత్యం, వృద్ధులకు ఆదరణ అనే తీపి మాటలు వెనుక డబ్బు సంపాదన, అక్రమ కార్యకలాపాలు దాగి ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదని, మానవ…

Read More

వాట్సాప్‌లో డ్రైవింగ్ లైసెన్స్ – ఢిల్లీ పౌరులకు సర్కారు కొత్త సౌకర్యం

సహనం వందే, న్యూఢిల్లీ:ఇకపై ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం వాట్సాప్ ద్వారానే ఇంటి నుంచి మ్యారేజ్ సర్టిఫికెట్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి ముఖ్యమైన ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ఢిల్లీ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న వాట్సాప్ గవర్నెన్స్ ప్లాట్‌ఫాం ప్రజల సమయాన్ని ఆదా చేసి, వారి జీవితాలను మరింత సులభతరం చేస్తుంది. ఈ కొత్త సౌలభ్యం వల్ల ప్రభుత్వ సర్వీసులు ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. ఎలా పని చేస్తుంది?ఈ సరికొత్త విధానం చాలా సులభంగా…

Read More

అజ్ఞాత దాతల అవినీతి ముసుగు – గుజరాత్‌లో వేల కోట్ల సీక్రెట్ డొనేషన్స్

సహనం వందే, న్యూఢిల్లీ:గుజరాత్‌లో జరిగిన భారీ అక్రమ ఆర్థిక లావాదేవీలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేయడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. 2019-24 మధ్య కాలంలో గుజరాత్‌లోని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు… సంస్థలు ఏకంగా రూ. 4,300 కోట్ల భారీ విరాళాలు స్వీకరించాయని ఒక మీడియా నివేదికను ఉటంకిస్తూ ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం ఎవరిది? ఏ ఉద్దేశంతో ఇచ్చారు? ఎవరికి చేరాయి? అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల…

Read More

వెలుగులోకి నటి చీకటి కోణం – మళయాళ లక్ష్మీ మీనన్‌పై కిడ్నాప్‌ కేసు

సహనం వందే, కోచి:సినిమా తెరపై అందమైన పాత్రలతో యువతను అలరించిన యువ నటి లక్ష్మీ మీనన్‌ పై కిడ్నాప్‌, దాడి కేసు నమోదవ్వడం సినీ లోకాన్ని కుదిపేసింది. పేరు ప్రఖ్యాతులు ఉన్న ఒక నటి ఇలాంటి తీవ్రమైన ఆరోపణల్లో చిక్కుకోవడం పరిశ్రమ వర్గాలను, ఆమె అభిమానులను విస్మయానికి గురిచేసింది. కొచ్చిలోని ఒక ఐటీ ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమెతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో ఈ వివాదం ఒక్కసారిగా సంచలనంగా మారింది. సినిమాలకు…

Read More

భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు….

Read More