పసుపుకు కేంద్రం మద్దతు ధర ఇవ్వాలి
సహనం వందే, హైదరాబాద్:పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పసుపు రైతులను పట్టించుకోలేదని, కానీ ప్రతిపక్షంలోకి వచ్చాకా.. పసుపు రైతులపై దొంగ ప్రేమ ఒలకపోస్తుందని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో పసుపు రైతులు ఆందోళన చేస్తే… రోడ్ల మీదకు రాకుండా ఆంక్షలు పెట్టి, కేసులు పెట్టి జైల్లో వేసిన చరిత్ర మీది అని గుర్తుచేశారు. తనపై సైతం కేసులు పెట్టినట్లు తెలిపారు. మంగళవారం ఆయన హాకా భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పసుపు…