ఉస్మానియాలో ఆంక్షలు ఎత్తివేయాలి – సీపీఎం నాయకులు వీరయ్య డిమాండ్
సహనం వందే, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన కార్యక్రమాలపై నిషేధం విధిస్తూ వైస్ ఛాన్సలర్ జారీ చేసిన ఆదేశాలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్. వీరయ్య ప్రకటన విడుదల చేశారు. వివిధ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది. “వైస్ ఛాన్సలర్ చేత ఇలాంటి…