టూరిస్టుగా వెళ్లండి బంగారం తవ్వుకోండి – ఫిన్లాండ్ దేశంలో గోల్డ్ రష్ టూరిజం
సహనం వందే, ఫిన్లాండ్: శాంతాక్లాజ్ పుట్టిన గడ్డగా ప్రపంచానికి తెలిసిన ఫిన్లాండ్ ఇప్పుడు పర్యాటకులకు సరికొత్త ఆఫర్ ఇస్తోంది. కేవలం ప్రకృతిని చూడటమే కాదు… స్వయంగా భూమిని తవ్వి బంగారాన్ని వెలికితీసే సాహసానికి లాప్‌ల్యాండ్ వేదికవుతోంది. మంచు భూమిలో దాగున్న ఆ పసిడి రేణువులను వెతకడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పర్యాటక ఆకర్షణగా మారింది. ఈ అద్భుతమైన ప్రయాణం వెనుక ఉన్న అసలు విశేషాలు ఇవే. మంత్రముగ్ధమైన లాప్‌ల్యాండ్ మాయసాధారణంగా పర్యాటకులు బీచ్‌లు లేదా సినిమా థియేటర్ల వైపు…