ఎస్సీ వర్గీకరణకు కొత్త రూల్స్ – అమలు నిబంధనలు కఠినతరం
సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలుపై అధికారుల్లో నెలకొన్న సందిగ్ధతకు ప్రభుత్వం తెరదించింది. చట్టాలు, జీవోలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు న్యాయం ఆలస్యం కావడంపై సర్కార్ తీవ్రంగా స్పందించింది. ఎస్సీ వర్గాల రిజర్వేషన్లు పక్కాగా, పారదర్శకంగా అమలు కావాలనే లక్ష్యంతో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ 1828 నంబరుతో కీలకమైన మెమోను విడుదల చేసింది. చట్టం ఏ ఉద్దేశంతోనైతే రూపొందిందో, అదే స్ఫూర్తితో క్షేత్రస్థాయిలో అమలు జరగాలని స్పష్టం చేసింది. చట్టపరమైన రక్షణలకు జీవోలుఈ…