Speaker Telangana

ఫిరాయింపుల కంపు రాజకీయం – పార్టీలు మారినా దొరకని ఆధారాలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ముదిరి పాకాన పడింది. పదవుల కోసం పార్టీలు మారిన ఎమ్మెల్యేలను కాపాడేందుకు వ్యవస్థలను వాడుకుంటున్నారు. అధికార పార్టీ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం రాజకీయ నైతికతను ప్రశ్నార్థకం చేస్తోంది. సాక్ష్యాల వేటలో స్పీకర్ నాటకంగులాబీ గూడు వదిలి హస్తం నీడకు చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ ప్రసాద్ కుమార్ తేల్చారు. కళ్లముందే పార్టీ కండువాలు మార్చుకున్నా సాక్ష్యాలు లేవనడం హాస్యాస్పదంగా ఉంది. రాజ్యాంగ వ్యవస్థలను రాజకీయ…

Read More
Hyderabad link in Australia Attack

ఆస్ట్రేలియాలో హైదరాబాదీ ‘ఉగ్ర’రూపం – సిడ్నీ కాల్పుల టెర్రరిస్ట్ రాజధాని వాసుడే

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచాన్ని వణికిస్తున్న ఉగ్రవాద కార్యకలాపాలతో హైదరాబాద్‌ కు లింకులు పదే పదే వెలుగులోకి రావడం దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. తాజాగా ఆస్ట్రేలియాలో జరిగిన బీచ్ కాల్పుల దాడిలో 15 మందిని పొట్టనబెట్టుకున్న సాజిద్ అక్రమ్ అనే ఉగ్రవాదికి భారత పాస్‌పోర్ట్, అది కూడా హైదరాబాద్ నుంచి తీసుకున్నట్లు గుర్తించడం అనేక ప్రశ్నలకు దారితీసింది. సాజిద్ అక్రమ్ భారతీయ మూలాలు ఉన్నప్పటికీ, అతని రాడికలైజేషన్ అంతర్జాతీయ ఉగ్రవాదంతో ముడిపడి ఉంది. హైదరాబాద్…

Read More
Kavitha

కవిత అక్క… పార్టీ పక్కా – రాజకీయాలపై రగిలిపోతున్న జాగృతి నేత

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన సంచలన ప్రకటన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజా వ్యాఖ్యలు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతోందన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చాయి. 2029 సార్వత్రిక ఎన్నికలలో తాము పోటీ చేస్తామని కవిత స్పష్టం చేయడంతో భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కీలక మార్పులు అనివార్యమని…

Read More
Congress MLAs fails in Local Body Elections

తరిమికొట్టిన సొంతూరు – సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు సెగ

సహనం వందే, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చుక్కెదురైంది. కొందరు ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లోనే పార్టీ అభ్యర్థులను గెలిపించుకోలేకపోవడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సొంత గూటిలోనే ఓటర్లు పక్క చూపులు చూడటంతో దీనిపై రాష్ట్ర నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. అధికారం చేతిలో ఉన్నా సొంత గ్రామాలను గెలిపించుకోలేని ఈ దుస్థితి ఏమిటని అధిష్టానం మండిపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫలితాలు గ్రామాల్లో కాంగ్రెస్ పట్ల ప్రజల్లో…

Read More
Ramdev Baba Karam

రాందేవ్ బ్రాండ్ కారంతో రోగం – పురుగుమందుల మోతాదు అధికం!

సహనం వందే, న్యూఢిల్లీ: దేశీయ ఉత్పత్తులు, ఆరోగ్యం అంటూ డబ్బా కొట్టుకునే బాబా రాందేవ్ యాజమాన్యంలోని పతంజలి ఫుడ్స్ కంపెనీకి లోక్‌సభలో ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్ యూనిట్‌లో తయారు చేసిన పతంజలి ఎర్ర కారం పొడి శ్యాంపిల్స్‌లో పరిమితికి మించి పురుగుమందుల అవశేషాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయమంత్రి ప్రతాప్ రావు జాదవ్ స్వయంగా వెల్లడించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. రెండు రోజుల క్రితం ఫుడ్ సేఫ్టీపై లిఖితపూర్వకంగా సమాధానం ఇస్తూ మంత్రి ఈ విషయాన్ని…

Read More
Gorrelakunta Murders

ఐదేళ్ల నరమేధం… వీడని భయం – వరంగల్ జిల్లాలో సీరియల్ కిల్లర్ వ్యవహారం

సహనం వందే, వరంగల్: ఐదేళ్ల కిందట తెలుగు రాష్ట్రాలను వణికించిన గొర్రెకుంట సీరియల్ కిల్లర్ వ్యవహారం ఇప్పటికీ ప్రజల మనసుల్లో ఒక పీడకలలా వెంటాడుతూనే ఉంది. కేవలం ఒక అక్రమ సంబంధంతో మొదలైన ఈ దారుణం పది మంది హత్యకు దారితీసింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలో 2020 మే నెలలో జరిగిన ఈ సామూహిక హత్యల ఘటన నేరం ఎంతటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో చూపించింది. పోలీసుల చర్యలతో నేరస్తుడికి ఉరిశిక్ష పడినా ఆ…

Read More
Narahari

తెలంగాణ వైద్య విధాన పరి’చిత్తు’ – సకాలంలో జీతాలు అందక వైద్యుల అవస్థలు

సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ)లో పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడంపై తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) మండిపడింది. నెలల తరబడి జీతాలు అందకపోవడం… హెల్త్ కార్డులు ఇవ్వకపోవడం… అనేక జిల్లాల్లో డిప్యూటీ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ (డీసీహెచ్ఎస్) పోస్టులు ఖాళీగా ఉండటం వంటి అంశాలు పరిషత్‌ పరిధిలోని ఆసుపత్రుల కార్యకలాపాలను, వైద్య సిబ్బంది మనోబలాన్ని పూర్తిగా దెబ్బతీశాయి. పరిపాలన స్తంభించడంతో రోజూవారీ పనులు నిలిచిపోయి ప్రజలకు వైద్య సేవలు…

Read More
Foot Ball Messi

అరుదైన వ్యాధితో మెస్సీ’ఫుట్‌బాల్’ – కష్టాల కడలి నుంచి ప్రపంచ శిఖరాలకు!

సహనం వందే, హైదరాబాద్: ప్రపంచ ఫుట్‌బాల్ ఆరాధ్య దైవం… లక్షలాది మంది అభిమానుల కలల వీరుడు లియోనెల్ మెస్సీ శుక్రవారం భారత్‌కు రానున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూలు ఇప్పటికే ఖరారైంది. కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీలలో ఆయన పర్యటిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ దృష్ట్యా అధికారులు ఈ పర్యటన కోసం భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పర్యటన పూర్తిగా వాణిజ్యపరమైనదిగా తెలుస్తోంది. కష్టాల కడలి దాటిన దిగ్గజం…ఫుట్‌బాల్ మైదానంలో తన మాయాజాలంతో ప్రపంచాన్ని…

Read More
Global Summit Hydraa Highlight

గ్లోబల్ సమ్మిట్… హైడ్రా హైలైట్ – గ్లోబల్ సమ్మిట్‌లో హైద‌రాబాద్ ముద్ర

సహనం వందే, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌కు దేశ విదేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు హైడ్రా కార్యకలాపాలపై అమితాసక్తి చూపించారు. ముఖ్యంగా నగరంలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణ గురించి వారు ఆరా తీశారు. అలాగే వర్షాకాలంలో వరదల నివారణకు హైడ్రా తీసుకున్న పటిష్ట చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రతినిధులు, పర్యావరణవేత్తలు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఆయన చేస్తున్న కృషి పట్ల అభినందనలు తెలిపారు. చెరువుల అభివృద్ధిపై…

Read More
Sania Mirza and with her' Son

టెన్నిస్ తూచ్… అమ్మతనమే అదుర్స్ – స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జా భావోద్వేగం

సహనం వందే, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఆటలోనే కాదు జీవితంలోనూ విజేతగా నిలిచింది. అనేక గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సానియా… కోర్టు బయట తన తల్లి అనుభవాలను పంచుకుంది. తన కొడుకు ఇజ్హాన్‌ను పెంచే క్రమంలో తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం… జీవితంలో సమతుల్యత (బ్యాలెన్స్) సాధించడమే అని ఆమె అంటున్నారు. టెన్నిస్‌లో గెలవడం మాత్రమే కాదు, జీవితపు మ్యాచ్ ప్లాన్‌లో విజయం సాధించాలంటే కుటుంబం, కెరీర్ మధ్య…

Read More