బ్యాన్‌తో సినిమా బ్లాస్ట్ – సట్లూజ్ సినిమా పెను తుఫాన్
సహనం వందే, హైదరాబాద్: పంజాబ్‌లో ఉగ్రవాదాన్ని అణచివేసిన ఆ చీకటి దశాబ్దపు గాయాలను కళ్లకు కడుతూ తెరకెక్కిన సట్లూజ్ సినిమాపై ప్రభుత్వం విధించిన ఆకస్మిక నిషేధం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. డిజిటల్ వేదికల నుంచి ఈ చిత్రాన్ని తొలగించినప్పటికీ వివాదాల కారణంగా జనం దీనిని చూసేందుకు ఎగబడుతుండటంతో పాలకుల సెన్సార్ విధానాలపై తీవ్రమైన ప్రశ్నలు వ్యూహాత్మకంగా తలెత్తుతున్నాయి. పంజాబ్ గాయాలు వెలుగులోకిపంజాబ్‌లో జరిగిన అన్యాయాలు ఆపరేషన్ బ్లూస్టార్ తర్వాతి పరిణామాలు ఆపై సాగిన అండర్‌గ్రౌండ్ మలిటెన్సీ…