అప్పు పుట్టదు… ఫీజు తగ్గదు – విద్యా రుణాలు కష్టం… ఫీజులు భారం
సహనం వందే, హైదరాబాద్: మన దేశంలో ఉన్నత చదువులు చదవాలనుకునే సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం శరాఘాతంగా మారుతోంది. ఒకప్పుడు పిల్లలను డాక్టర్లు, ఇంజనీర్లుగా తీర్చిదిద్దేందుకు బ్యాంకులపై ఆధారపడే పరిస్థితి ఉండేది. కానీ గత పదేళ్ల కాలంలో విద్యా రుణాల సరళి పూర్తిగా మారిపోయింది. ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల మోత తట్టుకోలేక, బ్యాంకుల్లో అప్పులు పుట్టక అభ్యర్థులు వెనకడుగు వేస్తున్నారు. ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన నికర రుణాల…