పోరాడితే పొట్ట కూటిపై దెబ్బ – నిరసనల్లో పాల్గొంటే ఉద్యోగం ఇవ్వరు
సహనం వందే, ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ఒక సంచలన నిర్ణయం వెలువడింది. ఉద్యోగాలను ఆశించే అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేయాలని నిర్ణయించింది. కేవలం విద్యార్హతలు ఉంటే సరిపోదని, గత చరిత్ర కూడా మంచిగా ఉండాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా అసాంఘిక శక్తులు ప్రభుత్వ వ్యవస్థల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికే ఈ నిబంధనలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. నిరసనకారులు, నేరస్థులపై నిషేధంరాష్ట్రంలో హింసాత్మక నిరసనల్లో పాల్గొనేవారికి, తీవ్రమైన నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు…