మరణశయ్యపై ప్రాంతీయ పార్టీలు – బీజేపీ కూటమి వ్యూహంలో సతమతం
సహనం వందే, హైదరాబాద్: భారతదేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల మనుగడ ప్రమాదంలో పడింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ నినాదం దాటి ప్రాంతీయ పార్టీలను మింగేసి దిశగా వ్యూహాలు సాగుతున్నాయి. ప్రత్యక్ష పోరులో గెలిచినప్పటికీ ఆ తర్వాత ఎదురవుతున్న చీలికలు, ఫిరాయింపులు, అధికార కూటమిలో విలీనాలు ప్రాంతీయ పార్టీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. సరికొత్త రాజకీయ ముప్పుప్రాంతీయ పార్టీలు ఎన్నికల క్షేత్రంలో భారతీయ జనతా పార్టీని నేరుగా ఢీకొట్టి విజయాలు సాధిస్తున్నా వాటి అసలు కథ అక్కడితో ముగియడం…