దివ్య ప్రసాదం దైదీప్యమానం – తిరుపతి లడ్డూలో కొత్త కాంతి
సహనం వందే, తిరుపతి: తిరుమల లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడే విషయంలో టీటీడీ అడుగులు వేగవంతం అయ్యాయి. గతంలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని శాస్త్రీయ పరీక్షలకే ప్రాధాన్యతనిస్తోంది. సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్టీఆర్ఐ)తో చేతులు కలిపి ప్రసాదం తయారీలో అత్యున్నత ప్రమాణాలను పాటించేలా చర్యలు చేపట్టింది. ఈ కొత్త మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలు ఇవే. ఒప్పందం వెనుక లక్ష్యంతిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యతను అత్యున్నత స్థాయిలో ఉంచాలని…