ఇథనాల్ గోల… ఇంజిన్ల గరగర – వాహనదారులకి తీరని తాపం
సహనం వందే, హైదరాబాద్: దేశవ్యాప్తంగా పెట్రోల్ వాహనదారుల గుండెల్లో ఈ-20 ఇంధనం గుబులు రేపుతోంది. తమ వాహనాల ఇంజిన్లు దెబ్బతింటున్నాయనే ఆందోళన వాహనదారుల్లో పెల్లుబుకుతోంది. ఈ పరిస్థితుల్లో 45 శాతం మంది యజమానులు ఏకంగా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. కారు ఇంజిన్లను ప్రయోగశాలలుగా మార్చారనే ఆగ్రహం సామాన్యుల్లో కనిపిస్తోంది. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పరిణామాలు తీవ్రంగా ఉండేలా ఉన్నాయి. ప్రయోగంపై జనాల్లో తీవ్ర ఆగ్రహంసామాన్య ప్రజల అనుమతి లేకుండా ఇంజిన్లపై ఈ-20 ప్రయోగాలు చేయడం…