ఆపరేషన్లంటే డాక్టర్ల పరేషాన్ – సర్జరీ కోర్సులు అంటే విద్యార్థుల్లో వణుకు
సహనం వందే, హైదరాబాద్: వైద్య వృత్తి అంటేనే నిస్వార్థ సేవకు, ప్రాణాలు కాపాడే సాహసానికి ప్రతీక. అర్ధరాత్రి ఒంటి గంటయినా, రెండు గంటలైనా ప్రాణాలతో కొట్టుమిట్టాడే రోగిని బతికించడానికి డాక్టర్లు పరుగులు పెడుతుంటారు. కానీ అలాంటి డాక్టర్లే ఇప్పుడు కెరీర్ మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే నమ్మగలరా? తాజాగా నీట్ పీజీ మొదటి కౌన్సిలింగ్కు సంబంధించి వెలువడిన టాప్ 100 ఛాయిస్ల గణాంకాలు వైద్య రంగంలో ఒక సంచలన మార్పును కళ్లకు కడుతున్నాయి. టాపర్లు అందరూ సర్జరీల వైపు…