ఓవర్ ట్రీట్మెంట్… ఓవర్ మెడికేషన్ – వైద్య వ్యాపారంలో నలిగిపోతున్న రోగులు
సహనం వందే, హైదరాబాద్: చిన్న తలనొప్పితో ఆస్పత్రికి వెళ్తే పది రకాల టెస్టులు రాసి, ల్యాబ్ రిపోర్టులతో భయపెట్టి గుప్పెడు మందులు మింగిస్తున్నారు. మన దేశంలో రోగం తగ్గడం కంటే జేబులు, శరీరాలు గుల్ల కావడమే ఎక్కువవుతోంది. డాక్టర్ చంద్రకాంత్ లాహరియా రాసిన ‘పిల్-ఫ్రీ’ పుస్తకం భారతదేశంలో జరుగుతున్న ఓవర్ట్రీట్మెంట్, ఓవర్మెడికేషన్ను బట్టబయలు చేసింది. ఆధునిక వైద్యంలో అత్యాధునిక స్కానింగ్లు వచ్చినప్పటికీ, అదే స్థాయిలో పరిమితికి మించిన చికిత్సలు పెరిగాయి. హెల్త్ చెకప్ల తప్పుడు రిపోర్టులుఅనవసర వైద్యానికి…