మోడీ ఇంట్లో ‘సీక్రెట్’ చూశా – విజయనగరం ఎంపీ అప్పలనాయుడు వెల్లడి

సహనం వందే, హైదరాబాద్:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజా నాయకుడు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కలలుగన్న ఆయన… ఏకంగా ఎంపీగా పార్లమెంటులో అడుగు పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎంపీ అయిన వెంటనే తిరుపతికి వెళ్లి ప్రసాదం తీసుకొని ఢిల్లీ వెళ్లారు. ప్రధాని నివాసం వద్దకు చేరుకున్నారు. మోడీ అపాయింట్మెంట్ లేదు. కానీ కలవాలన్న కృతనిశ్చయంతో వెళ్లారు. ఆయన నమ్ముకున్నట్లు మోడీ కలవడానికి అనుమతి లభించింది. ప్రసాదం చేతిలో పెట్టి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటన అనేకమంది…

Read More

రైల్వే సమస్యలపై ఎంపీ గళం -ప్రజల గొంతుకైన ఎంపీ అప్పలనాయుడు

సహనం వందే, భువనేశ్వర్:ఈస్ట్ కోస్ట్ రైల్వే జోనల్ కమిటీ సమావేశం వేదికగా విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ప్రజల గళాన్ని బలంగా వినిపించారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాల రైల్వే సమస్యలను జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ ముందు వివరించారు. గత పార్లమెంట్ సమావేశాల్లోనూ తాను ఈ సమస్యలను లేవనెత్తినట్లు గుర్తు చేస్తూ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం భువనేశ్వర్ లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో…

Read More

సిగ్నల్ ట్యాంపరింగ్ తో రైలు ఆపి దోపిడీ – నాగర్‌సోల్‌-నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో ఘటన

సహనం వందే, గుంటూరు:దొంగలు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. రైలు సిగ్నల్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసి అర్ధరాత్రి దోపిడీలకు పాల్పడుతున్నారు. ఇది రైల్వే వ్యవస్థ డొల్లతనానికి నిదర్శనం. గుంటూరు జిల్లాలో అటువంటి సంఘటనే జరిగింది. నాగర్‌సోల్ నుంచి నర్సాపురం వెళుతున్న నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలోని మాచర్ల హైవే అండర్ బ్రిడ్జి వద్ద దుండగులు సిగ్నల్ వ్యవస్థను ట్యాంపర్ చేశారు. రెడ్ సిగ్నల్ కనిపించడంతో లోకో పైలట్ రైలును 35…

Read More

రాజమండ్రి శ్రీచైతన్యలో ర్యాగింగ్‌ భూతం – ఇస్త్రీ పెట్టెతో ఒళ్ళు కాల్చిన సీనియర్లు

సహనం వందే, రాజమండ్రి:విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం చూపించాల్సిన విద్యాసంస్థలు ముఖ్యంగా హాస్టళ్లు ఇప్పుడు హింసకు అడ్డాగా మారుతున్నాయన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాజమండ్రిలోని మోరంపూడిలో ఉన్న శ్రీ చైతన్య హాస్టల్‌లో పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థిపై సహచరులు దారుణంగా ర్యాగింగ్‌ కు పాల్పడిన ఘటన ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన గుఱ్ఱం విన్సెంట్ ప్రసాద్ అనే పదహారేళ్ల విద్యార్థిపై జరిగిన ఈ అమానుష దాడి సమాజాన్ని దిగ్భ్రాంతికి…

Read More

పవన్ కళ్యాణ్ పై సీపీఐ నారాయణ నోటి దురుసు

సహనం వందే ఒంగోలు:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నోటి దురుసు ప్రదర్శించారు.‌ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు. విమర్శలు హద్దులు దాటి పోవడం పరాకాష్ట. నారాయణ సహజంగానే తెగించి ఇష్టరాజ్యంగా మాట్లాడుతారన్న విమర్శలు ఉన్నాయి. సోమవారం ఒంగోలులో జరిగిన ఆ పార్టీ రాష్ట్ర మహాసభలో నారాయణ ప్రసంగించారు. సనాతన ధర్మంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అగ్గికి ఆజ్యం పోశాయి. ఈ వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ పవన్…

Read More

500 కోట్ల సైబర్ మోసగాడు – బెజవాడ యువకుడు శ్రవణ్ గ్యాంగ్ నిర్వాకం

సహనం వందే, విజయవాడ:విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక…

Read More

డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

సహనం వందే, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను…

Read More

ఉపరాష్ట్రపతి అభ్యర్థికి ఎంపీ కలిశెట్టి అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికైన సీపీ రాధాకృష్ణన్‌ను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో సహా మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం న్యూఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో వారు రాధాకృష్ణన్‌కు తమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వకం మాత్రమేనని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తమ మద్దతును తెలియజేసేందుకు ఈ భేటీ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు…

Read More

ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

సహనం వందే, న్యూఢిల్లీ:విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి…

Read More

నాడు సుందరయ్య… నేడు అప్పలనాయుడు – సైకిల్ పై పార్లమెంటుకు ఎంపీ

సహనం వందే, ఢిల్లీ:కమ్యూనిస్టు నేత పుచ్చలపల్లి సుందరయ్య 1952 ప్రాంతంలో పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. అంతేకాదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. అంతటి కీలక స్థానంలో ఉన్న సుందరయ్య నిరాడంబరంగా సామాన్యుడి సైకిల్ పై పార్లమెంటుకు వెళ్లేవారు. తన ఫైల్స్ ను సైకిల్ పై పెట్టుకొని వెళ్లడం అనేక మందిని ఆశ్చర్యపరిచింది. అచ్చం అలాగే ప్రస్తుత తెలుగుదేశం పార్టీకి చెందిన విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు కూడా సైకిల్ పై పార్లమెంటుకు వెళుతుండడం అత్యంత ఆసక్తికరంగా మారింది….

Read More