నా బ్రాండ్ ‘యంగ్ ఇండియా’
సహనం వందే, హైదరాబాద్:‘ప్రతీ ముఖ్యమంత్రికీ ఒక బ్రాండ్ ఉంటుంది. రూ. 2కే కిలో బియ్యం ఎన్టీఆర్ బ్రాండ్.. ఐటీ అంటే చంద్రబాబు.. జలయజ్ఞం, ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ గుర్తుకు వస్తారు. కొంతమంది ఉద్యమాలే తమ బ్రాండ్ అని గొప్పలు చెప్పుకుంటారు.. యంగ్ ఇండియా స్కూల్ ఈజ్ మై బ్రాండ్’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. “దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉందని నేను విశ్వసిస్తున్నా. యంగ్ ఇండియా మా బ్రాండ్‌గా, తరగతి గదులను బలోపేతం చేస్తాం” అన్నారు….