మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కాలంలో హాట్ టాపిక్‌గా మారిన మంత్రివర్గ విస్తరణ వ్యవహారం ప్రస్తుతానికి నిలిచినట్లే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్‌ను విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలోని సీనియర్ నాయకులు, అధిష్ఠానం నుంచి వస్తున్న ఒత్తిడి కారణంగా ఈ ప్రక్రియ ఆలస్యమవుతోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. రేవంత్ నిర్ణయాలకు పెద్దల అడ్డుకట్ట…రేవంత్ రెడ్డి సొంత నిర్ణయాలతో ముందుకు…