మోడీతో ఎంపీ కలిశెట్టి ఆనంద క్షణాలు – కుటుంబ సభ్యులతో కలిసి భేటీ
సహనం వందే, న్యూఢిల్లీ: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కుటుంబ సమేతంగా కలిశారు. ప్రధానికి కలిశెట్టి కుటుంబసభ్యులు చేనేత వస్త్రాలైన పంచె, లాల్చీ, కండువాను కానుకగా అందించారు. విజయనగరం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చేనేత కార్మికులు స్వయంగా నేసిన ఈ దుస్తులను స్వీకరించిన ప్రధాని మోదీ… అప్పలనాయుడు కుటుంబానికి ఆత్మీయ స్వాగతం పలికారు. ఉదయం ప్రధాని విడుదల చేసిన ప్రత్యేక వీడియోను…