విస్కీతో మస్కా… మత్తులో చెత్త – ప్రముఖ లిక్కర్ బ్రాండ్ల బండారం బట్టబయలు
సహనం వందే, హైదరాబాద్: గ్లాసులో పోసే మందులో అసలు మత్తెంత, అందులో కల్తీ ఎంత అనే కోణంలో ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం రేగుతోంది. తాగే వారి గొంతులోకి దిగేది అసలు సిసలైన సరుకా లేక రసాయనాల రసమా అనే దిగ్భ్రాంతికర నిజాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. నిత్యం కిక్కు కోసం కోట్లాది మంది నమ్ముతున్న కొన్ని ప్రముఖ బ్రాండ్ల వెనుక జరుగుతున్న నయా మోసాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా బట్టబయలు చేసింది….