కేంద్రంలో టీడీపీ పట్టు తప్పుతుందా? – ప్రాంతీయ పార్టీలను చీల్చుతున్న బీజేపీ
సహనం వందే, అమరావతి: ఎన్డీయేలో అతిపెద్ద భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ పట్టు ఇక తగ్గుతుందా? ప్రాంతీయ పార్టీలను వరుసగా చీలుస్తూ కేంద్రంలో బీజేపీ తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంటోంది. లోక్సభలో 240 స్థానాలతో సొంత మెజారిటీకి దూరంగా ఉన్న కాషాయ దళం… ఇప్పుడు ఇతర పార్టీల నుంచి వస్తున్న అసమ్మతి ఎంపీలతో 319 స్థానాలకు చేరింది. ఇదే ఇప్పుడు దేశ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపింది. మారుతున్న బలాబలాలులోక్సభ ఎన్నికల్లో 240 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీకి…