ప్రజా నాయకుడి శరీరమూ ప్రజలకే అంకితం – మెడికల్ కాలేజీకి సురవరం భౌతికకాయం

సహనం వందే, హైదరాబాద్:సిపిఐ అగ్రనేత, జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డికి రెడ్ ఆర్మీ ఘనంగా అంతిమ వీడ్కోలు పలికింది. ఆయన భౌతికకాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో గౌరవించింది. అంతిమయాత్రలో వేలాది మంది ప్రజలు, నాయకులు పాల్గొని నివాళులర్పించారు. సుధాకర్ రెడ్డి చివరి కోరిక మేరకు ఆయన భౌతికకాయాన్ని వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. అంతిమయాత్రలో ముందు పోలీసులు అధికారిక గౌరవ వందనం సమర్పించగా, ఆ తర్వాత…

Read More

మా దేశం… మా కోసం – టూరిస్ట్ గోబ్యాక్ – యూరోపియన్ల నినాదం

సహనం వందే, యూరప్:ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో స్థానిక ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. ‘మా దేశం మా కోసమే’నని అక్కడి ప్రజలు నినదిస్తున్నారు. టూరిస్టుల పేరుతో తమ అందమైన నగరాలను నాశనం చేస్తున్నారని… తమ జీవనశైలిని, సంస్కృతిని, ఉనికిని ధ్వంసం చేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఆదాయ వనరుగా భావించిన పర్యాటకం ఇప్పుడు యూరప్‌లోని అనేక నగరాలకు సమస్యగా మారింది. పర్యాటకుల తాకిడి పెరిగి స్థానిక సంస్కృతి, జీవనశైలి దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బార్సిలోనా నుంచి…

Read More

500 కోట్ల సైబర్ మోసగాడు – బెజవాడ యువకుడు శ్రవణ్ గ్యాంగ్ నిర్వాకం

సహనం వందే, విజయవాడ:విజయవాడకు చెందిన యువకుడు శ్రవణ్ కుమార్ రెండు నెలల్లోనే 500 కోట్ల రూపాయల సైబర్ క్రైంకు పాల్పడడం సంచలనం అయ్యింది. అతన్ని హైదరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. శ్రవణ్ కుమార్ 500 మ్యూల్ అకౌంట్లు సృష్టించి వాటి ద్వారా 500 కోట్ల పైచిలుకు నగదు బదిలీలు చేసిన విషయం తెలిసింది. సైబర్ లింకుల ద్వారా వచ్చిన మోసపూరిత డబ్బును ఈ అకౌంట్లలోకి మార్చి, తర్వాత ఫేక్ కంపెనీలకు పంపేవాడు. ఈ వ్యవస్థలో ఆరు కంపెనీలకు ప్రత్యేక…

Read More

వినాయక చవితి విశిష్టత – సంతోషం పంచే సనాతన సంప్రదాయం

భారతీయ సంస్కృతిలో పండుగలకు విశిష్ట స్థానం ఉంది. ప్రతి పండుగ ఒక ప్రత్యేకమైన సందేశాన్ని, ఒక తాత్విక బోధనను అందిస్తుంది. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది వినాయక చవితి. భాద్రపద శుద్ధ చవితి నాడు గణనాథుడిని ఆరాధించడం అనాది కాలం నుండి వస్తున్న సనాతన సంప్రదాయం. విఘ్ననాయకుడు, విద్యాదాయకుడు, ఐశ్వర్యప్రదాత అయిన గణపతిని పూజించడం ద్వారా జీవితంలో ఆనందం, శాంతి, సౌఖ్యం కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణపతి రూపంలోనే ఎన్నో బోధనలు!వినాయకుడు గజాననుడు, విఘ్నేశ్వరుడు, గణాధిపతి, సిద్ధివినాయకుడు…

Read More

యూరియా కోసం రైతుల రాళ్ల దాడి

సహనం వందే, వనపర్తి:యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద అధికారులను నిలదీశారు. వారు స్పందించకపోవడంతో రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.‌ మరోవైపు కొందరు మార్క్…

Read More

డబ్బుల్లో బాబు… కేసుల్లో రేవంత్ – దేశంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు టాప్

సహనం వందే, హైదరాబాద్:తెలుగు రాష్ట్రాల సీఎంలు దేశంలో మొదటి స్థానాల్లో ఉన్నారు. ఒకరు డబ్బుల్లో, మరొకరు కేసుల్లో ముందున్నారు. అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిలియనీర్ గా టాప్ పొజిషన్లో ఉన్నారు. ఆయన ఆస్తి రూ. 931 కోట్లు. అత్యంత పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఉన్నారు. ఆమె ఆస్తి కేవలం రూ. 15 లక్షలు. భారతదేశంలోని 30 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల ఆస్తులు, కేసుల వివరాలను…

Read More

గెలిపించిన వ్యూహాలే ఓడిస్తున్నాయ్ – బోర్లాపడ్డ ప్రశాంత్ కిషోర్

సహనం వందే, పాట్నా:రాజకీయ వ్యూహాలతో ఎన్నో పార్టీలను అధికార గద్దెలపై కూర్చోబెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సొంత పార్టీని నడపలేక నలిగిపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, శివసేన, డీఎంకే, టీఎంసీ వంటి పార్టీలకు విజయ మార్గాలు చూపిన ఈ వ్యూహకర్త… బీహార్‌లో తన జన్ సురాజ్ పార్టీతో అసెంబ్లీ ఎన్నికల్లో అదృష్టం పరీక్షిస్తున్నారు. కానీ ఆయన గత విజయాలు ఇప్పుడు ఓటమి నీడల్లో కనుమరుగవుతున్నాయి. అధికార కూటముల సవాళ్లు…అక్టోబర్‌లో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ…

Read More

ఏఐ సైకోసిస్ – దాంతోనే ఒంటరిగా గడిపితే భ్రమల్లో జీవితం

సహనం వందే, అమెరికా:కృత్రిమ మేధస్సు (ఏఐ) అభివృద్ధి మానవాళికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని ఏఐ పితామహుడిగా పేరుగాంచిన జాఫ్రీ హింటన్ చేసిన హెచ్చరికలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఏఐ పరిశోధన ఒక ఆయుధాల పోటీలా మారిందని, దీనిపై నియంత్రణ లేకపోతే అణ్వాయుధాల కంటే ప్రమాదకరమైన పరిణామాలు తప్పవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విప్లవం ప్రపంచంలో పెను మార్పులు తీసుకొస్తున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలోచింపజేస్తున్నాయి. భద్రతా ప్రమాణాలు విస్మరిస్తున్న కంపెనీలు…ఒకప్పుడు…

Read More

కమ్యూనిస్టు నేత సురవరం కన్నుమూత – రేవంత్ రెడ్డి సంతాపం

సహనం వందే, హైదరాబాద్:సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం కమ్యూనిస్టు పార్టీకి, కార్మిక వర్గానికి తీరని లోటు. విద్యార్థి దశ నుంచే పోరాటం…1942 మార్చి 25న మహబూబ్‌నగర్ జిల్లాలో జన్మించిన సుధాకర్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై పోరాడారు. కేవలం 15 ఏళ్ల వయసులోనే పాఠశాలలో…

Read More

డబ్బుల్ పెండింగ్… ఆసుపత్రులు క్లోజింగ్ – ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల అల్టిమేటం

సహనం వందే, హైదరాబాద్:తెలంగాణ ఆరోగ్యశ్రీ పథకంలో సేవలు అందిస్తున్న నెట్‌వర్క్ ఆస్పత్రులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించకపోతే ఈనెల 31వ తేదీ అర్ధరాత్రి నుంచి సేవలను నిలిపివేస్తామని తెలంగాణ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ఫర్ ఆరోగ్యశ్రీ (తాన్హా) అధ్యక్షులు డాక్టర్ వద్దిరాజు రాకేష్ హెచ్చరించారు. . ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్), జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎస్) లాంటి పథకాల్లో సేవలు అందించడంలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని అసోసియేషన్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్…

Read More