అసెంబ్లీకి రారు… ప్రజల వద్దకు పోరు
సహనం వందే, హైదరాబాద్:తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు నిర్వహించిన సర్వే రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలక, ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో స్థానంలో నిలవడం తీవ్ర దుమారానికి రేకెత్తిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, ప్రజల్లో కూడా తిరగడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ, సర్వేలో ఆయనకు రెండో స్థానం దక్కడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కేసీఆర్ మేనల్లుడు ఎమ్మెల్యే హరీష్…