ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు
– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన సహనం వందే, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపేందుకు అత్యాధునిక ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా రవీంద్ర భారతిలో జరిగిన వేడుకల్లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి, యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత…