మహిళాలోకం ‘ఒంటరి’ జీవితం – తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం
సహనం వందే, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల సామాజిక ముఖచిత్రం మారుతోంది. పెళ్లిళ్లపై ఆసక్తి తగ్గడం, విడాకులు పెరగడం, భాగస్వామిని కోల్పోవడం వంటి కారణాలతో ఒంటరి మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఈ పరిణామం రాబోయే రోజుల్లో జనాభా కూర్పును, కుటుంబ వ్యవస్థను పూర్తిగా మార్చేయనుంది. మారుతున్న జీవనశైలితో పాటు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపబోయే ఆందోళనకర అంశాలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఒంటరితనంలో మహిళలదే పైచేయికేంద్ర ప్రభుత్వ తాజా ఎస్‌ఆర్‌ఎస్ నివేదిక సంచలన విషయాలను బయటపెట్టింది. దేశవ్యాప్తంగా ఒంటరిగా…